MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • TV
  • Brahmamudi Serial Today Episode: ఆస్తి మొత్తం కొట్టేసేందుకు రేఖ మాస్టర్ ప్లాన్... డబ్బు కోసం రాజ్ స్కామ్

Brahmamudi Serial Today Episode: ఆస్తి మొత్తం కొట్టేసేందుకు రేఖ మాస్టర్ ప్లాన్... డబ్బు కోసం రాజ్ స్కామ్

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఉత్కంఠగా సాగుతోంది. ప్లాన్ ప్రకారం ఎగ్జామ్‍కు వెళ్లింది ఇందు. స్లిప్పులతో దొరికిపోయింది ఐశ్వర్య..ల్యాప్ టాప్ అమ్మేందుకు రాజు వెళ్తాడు...తర్వాత ఏం జరిగింది?  

2 Min read
Author : Nandini Arava
Published : Mar 09 2026, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఇన్విజలేటర్‍తో పొగరుగా మాట్లాడి బయటకు వెళ్లిపోయిన ఐశ్వర్య
Image Credit : jio hotstar

ఇన్విజలేటర్‍తో పొగరుగా మాట్లాడి బయటకు వెళ్లిపోయిన ఐశ్వర్య

ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే...స్లిప్పులతో ఎగ్జామ్ రాస్తూ ఇన్విజలేటర్‍కు ఐశ్వర్య దొరికిపోతుంది. నేను ఒక్కదాన్నే కాదు..నా ఫ్రెండ్స్ కూడా స్లిప్పులు తెచ్చారంటూ వారిని కూడా ఇరికిస్తుంది. వెంటనే ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వెళ్లమంటారు..ఇన్విజలేటర్. ఐశ్వర్య పొగరుగా..డబ్బులు పెడితే మార్కెట్లో బోలెడు సర్టిఫికేట్లు వస్తాయంటూ అంటుంది. అక్కడినుంచి ఐశ్వర్య ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లిపోతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
అప్పు ఎగ్గొట్టడానికి రేఖ ప్లాన్
Image Credit : jio hotstar

అప్పు ఎగ్గొట్టడానికి రేఖ ప్లాన్

ఇక భూషణ్‍కు అప్పు ఇచ్చిన చక్రి...అప్పు తీర్చాలని డిమాండ్ చేస్తాడు. వడ్డీలు ఎప్పటికప్పుడు ఇస్తున్నాం కదా...ఇప్పుడు మళ్లీ అంత డబ్బంటే కట్టలేం అంటాడు భూషణ్. వడ్డీ ఇస్తున్నావని అసలుని వదులుకోలేను కదా అని చక్రి అంటాడు. అయితే అప్పన్నా తీర్చు, లేదంటే నీ కంపెనీ అయినా రాసిచ్చేయ్ అని చక్రి.. భూషణ్‍ను అంటాడు. అప్పు ఎగ్గొట్టడానికి రేఖ ప్లాన్ వేస్తుంది 

Related Articles

Related image1
Brahmamudi: ఇందు ఎగ్జామ్ కు వెళ్తుందా? రాజు ల్యాప్ టాప్ అమ్ముతాడా?
Related image2
Brahmamudi: రోడ్డుపై రాజుకు బుద్ధి చెప్పిన ఇందు..ఇన్విజిలేటర్ కు దొరికిపోయిన ఐశ్వర్య
38
చక్రికి రేఖ మెలిక పెట్టిన రేఖ
Image Credit : jio hotstar

చక్రికి రేఖ మెలిక పెట్టిన రేఖ

కంపెనీ రాసిచ్చేయ్‍ భూషణ్ అంటూనే....చక్రికి రేఖ మెలికపెడుతుంది.ఏంటీ గేమ్ ఆడుతున్నావా అని రేఖను చక్రి అడుగుతాడు. ఇప్పుడు భూషణ్ కంపెనీ లాస్‍లో ఉంది, ఆ కంపెనీ కొంటే మా అప్పులు తీరిపోవడమే కాకుండా లాస్‍లో ఉన్న కంపెనీ నుంచి మేం బయటపడతాం కదా అని రేఖ అంటుంది. ఈ మాత్రం తెలియదా..తెలివైన బిజినెస్ మ్యాన్ ఎప్పుడూ పనికిరాని చెత్తను కొనడు కదా అని చక్రిని ఆలోచనలో పెడుతుంది రేఖ.

48
రేఖను నమ్మి రూ. 2 కోట్ల చెక్కు ఇచ్చిన చక్రి
Image Credit : jio hotstar

రేఖను నమ్మి రూ. 2 కోట్ల చెక్కు ఇచ్చిన చక్రి

స్వరాజ్ గ్రూప్ గురించి నీకు తెలుసా చక్రి అని అడుగుతుంది రేఖ. కొంపదీసి ఆ కంపెనీ నీదంటావా ఏంటీ, దానికి నువ్వు గార్డెన్‍వి మాత్రమే కదా అని చక్రి అంటాడు. ఇంకా ఇందుకు సైన్ పవర్ రాలేదు కదా అంటాడు భూషణ్. 20 ఏళ్లుగా నా ఇంట్లోనే ఇందును పెట్టుకున్నా, కొన్ని రోజుల్లో ఆమెకు సైన్ పవర్ వచ్చి, నా పేరుపై కంపెనీతో పాటు ఆస్తి రాసేందుకు ఇందు సిద్ధంగా ఉందని రేఖ అంటుంది. కంపెనీ నా చేతికి వస్తే కాంట్రాక్ట్లు నీకే ఇస్తా....అందుకు నువ్వు తిరిగి రూ.2కోట్లు ఇవ్వాలని చక్రిని మాయ చేస్తుంది రేఖ. నేను రిస్క్ చేయలేనని చక్రి అంటాడు. రిస్క్ తో పాటు రిజల్ట్ కూడా ఉంటుదిలేఅని రేఖ అంటుంది. రేఖను నమ్మి చక్రి రూ. 2 కోట్లు ఇచ్చేస్తాడు. 

58
ల్యాప్ టాప్ ఇచ్చి రూ.50వేలు తీసుకుని పారిపోయిన రాజు, అతని ఫ్రెండ్
Image Credit : jio hotstar

ల్యాప్ టాప్ ఇచ్చి రూ.50వేలు తీసుకుని పారిపోయిన రాజు, అతని ఫ్రెండ్

ఇక మరోవైపు రాజు, అతని ఫ్రెండ్ కెఫేకు వస్తారు. ల్యాప్‍టాప్ ఇక్కడే అమ్మేందుకు రెడీగా ఉంటారు. ఆల్యాప్ టాప్ కొనేందుకు జాన్సన్ అనే వ్యక్తి అక్కడికే వస్తారు. ఆ ల్యాప్ టాప్ ఆన్ చేసిన 5 నిమిషాల్లోనే ఆగిపోతుంది, వాడికి ఎలా ల్యాప్ టాప్ అమ్ముతావ్ అని రాజు ఫ్రెండ్ అడుగుతాడు. ఆ టైం చాలు ఆ లోపు డబ్బులు కొట్టేద్దాంలే అని రాజు అంటాడు. ల్యాప్‍టాప్ ఓపెన్ చేస్తున్న జాన్సన్‍ను మాటల్లో పెట్టి రూ.50 వేలు డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పారిపోతారు...రాజు, రాజు ఫ్రెండ్.

68
రోడ్డుపై ఇందునూ చూసిన రేఖ
Image Credit : jio hotstar

రోడ్డుపై ఇందునూ చూసిన రేఖ

ఎగ్జామ్ రాసి వెళ్తున్న ఇందును రోడ్డుపై రేఖ చూస్తుంది. తను ఇందునే కదా అని భర్త భూషణ్‍ను అడుగుతుది రేఖ. ఇందులా ఏంటీ..ఇందునే అంటాడు భూషణ్, డ్రైవర్‍ను కారు యూటర్న్ తిప్పమంటుంది రేఖ. కానీ అప్పటికే ఇందు వెళ్లిపోవడంతో...ఎలాగైనా ఇంటికే వస్తుంది కదా, అక్కడ అడుగుదాంలే అని భూషణ్ అంటాడు. 

78
మోసం చేసి వెటకారంగా మాట్లాడిన రాజు
Image Credit : jio hotstar

మోసం చేసి వెటకారంగా మాట్లాడిన రాజు

లాప్‍టాప్ ఆన్ చేసిన జాన్సన్... అది ఓపెన్ అవ్వకపోవడం చూసి రాజుకు ఫోన్ చేస్తాడు. తెలిసిపోయిందా అంటాడు రాజు. పనిచేయని ల్యాప్‍టాప్ ఇచ్చి మోసం చేస్తారా అని ఫైర్ అవుతాడు జాన్సన్, రూ.2 లక్షల ల్యాప్‍టాప్..రూ.50వేలకే కొట్టేయాలని నువ్వు అనుకోలేదా అని రాజు అంటాడు. 

88
రేఖకు దొరికిపోయిన ఇందు
Image Credit : jio hotstar

రేఖకు దొరికిపోయిన ఇందు

ఇంటికి వచ్చిన ఇందును రేఖ ప్రశ్నిస్తుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దంటే...ఎందుకు వెళ్లావని నిలదీస్తుంది. స్వాతి డ్రెస్ కుట్టించడానికి వెళ్లమందని ఇందు చెప్తుంది. స్వాతినే పంపించిందని భ్రమరాంబ అంటుంది. అనుమానించాల్సిన పనిలేదని అంటుంది. కచ్చితంగా డౌట్ పడాలి వదిన అని రేఖ అంటుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Brahmamudi: ఇందు ఎగ్జామ్ కు వెళ్తుందా? రాజు ల్యాప్ టాప్ అమ్ముతాడా?
Recommended image2
Brahmamudi: రోడ్డుపై రాజుకు బుద్ధి చెప్పిన ఇందు..ఇన్విజిలేటర్ కు దొరికిపోయిన ఐశ్వర్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved