మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ 250 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ ఎండింగ్ దశకు వచ్చినప్పటికీ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు. 

అయితే షెడ్యూల్స్ అనుకున్నట్టుగా జరిగితే తప్పకుండా సెప్టెంబర్ లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చరణ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే సినిమా దసరా హాలిడేస్ ను టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమా కోసాం మెగాస్టార్ చాలా కష్టపడుతున్నట్లు కూడా చరణ్ తెలిపాడు. 

ఉదయం 4 గంటలకే నిద్రలేచి 7 గంటలకు మేకప్ తో రెడీ అవుతున్నట్లు చెబుతూ ఈ వయసులో కూడా ఆయన డెడికేషన్ చుస్తే చాలా గర్వంగా ఉంటుందని చరణ్ వివరించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతోంది. ఇక అమితాబ్ - నయనతార - సుదీప్ తో పాటు జగపతి బాబు ఇతర ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.