దక్షిణాదిలో నయనతారకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకున్న ఫాలోయింగే వేరు. ఓ పక్క సీనియర్ హీరోలతో మరోపక్క యంగ్ హీరోలతో నటిస్తూ బిజీ హీరోయిన్ గా గడుపుతోంది.

ప్రస్తుతం ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా' సినిమాలో నటిస్తోంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా కోసం నయనతార చాలా తక్కువ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.

చిరు పక్కన ఆ స్థాయి హీరోయిన్ ఉండాలనే కారణంతోనే నయన్ ఎన్ని షరతులు విధించినా దర్శకనిర్మాతలు ఏమీ అనలేకపోయారు. ప్రస్తుతానికి ఆమె చిరు కోసం మూడు రోజులు మాత్రమే కేటాయించిందట. షూటింగ్ కోసం ఆమె హైదరాబాద్ కి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ మూడు రోజుల్లో  నయనతార మీద మెజారిటీ సన్నివేశాలను చిత్రీకరించడం కోసం పక్కా ప్లానింగ్ తో షూటింగ్ ని నిర్వహిస్తున్నారు. మళ్లీ నయనతార డేట్లు దొరకడం కష్టమని సురేందర్ రెడ్డి బృందం భావిస్తోంది. 

ఇవి కూడా చదవండి.. 

'సైరా' ఆన్ లొకేషన్: డైరెక్టర్ పై అరిచేసిన చిరు..?

ఒలింపిక్ షూటర్ వద్ద మెగాస్టార్ ట్రైనింగ్!

'సై రా' విషయంలో అభిమానులకి నిరాశ తప్పదా..?

సైరా పిక్: న్యూ లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్!

సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?

సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

సైరా అప్డేట్: హైదరాబాద్ లో మెగా టీమ్ భారీ ప్లాన్!