నట సార్వభౌముడు, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు జీవితం  ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ జరవేగంగా జరుగుతోంది. మొదట చిత్ర దర్శకత్వ బాధ్యతల్ని తేజ తీసుకున్నారు. కానీ ‘సినిమాకు న్యాయం చేయలేను’ అంటూ ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. దర్శకుడు క్రిష్ సీన్ లోకి వచ్చారు. అలాగే ఇప్పుడు నిర్మాత కూడా తప్పుకున్నారు. కేవలం పోస్టర్స్ పై తప్ప ఆయన ఇన్వాల్వమెంట్ ఎక్కడా లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. 

ఈ చిత్రానికి విష్ణు ఇందూరి నిర్మాత.  సీసీఎల్ క్రికెట్ సృష్టిక‌ర్త గా... మాస్ట‌ర్ మైండ్‌గా పేరున్న విష్ణు ఆలోచ‌న నుంచి పుట్టిందే `ఎన్టీఆర్‌` బ‌యోపిక్ అని చెప్తారు. ఆయనే కొంతమంది రైటర్స్ తో స్క్రిప్టు రెడీ చేసుకుని బాల‌య్య తో మొదలెట్టారు. ఆ త‌రువాతే ప్రముఖ నిర్మాత సాయి కొర్ర‌పాటి తోడ‌య్యాడు. ఈ ప్రాజెక్టులో నేనూ ఓ చెయ్యి వేస్తానంటూ... బ్రహ్మ తేజ ప్రొడక్షన్స్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి.. బాలకృష్ణ ఈ సినిమా నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్నారు. 

అంతా బాగానే ఉంది. అనుకున్నట్లే క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఇండస్ట్రీ జనం, నందమూరి అభిమానులే కాక సగటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూసేలా పోస్టర్స్ తో బజ్ సృష్టించారు క్రిష్. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు మూలమైన విష్ణు ఇందూరి ఎక్కడ కనిపిచటం లేదని, ఆయన్ని ప్రక్కకి పెట్టేసారనే వార్త సోషల్ మీడియాలో ప్రారంభమై వెబ్ మీడియాకు చేరింది. చిత్ర నిర్మాణంలో ఆయన ఎక్కడా కనిపించటం లేదు. ఇందులో నిజమెంత అంటే...అందుతున్న సమాచారం ప్రకారం విష్ణు ఇందూరికు ఇదొక్కటే ప్రాజెక్టు కాదు. ఆయన జయలలిత బయోపిక్ సైతం ప్రారంభించేందుకు పావులు కదుపుతున్నారు.

 ఆ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఓ నిర్మాతగా ప్రాజెక్టు సజావుగా ప్రారంభమై , షూటింగ్ జరిగేందుకు విష్ణు చెయ్యాల్సిందంతా చేసారు. మరో ప్రక్క సీనియర్ నిర్మాత సాయి కొర్రపాటి కూడా అక్కడే ఉన్నారు. దాంతో ఆయన కూల్ గా తన బిజినెస్ పనుల్లో బిజీ అయ్యారు. ఎప్పుడూ షూటింగ్ లో ఉండాల్సిన అవసరం ఆయనకేంటి. ఇలాంటి రూమర్స్ పుట్టించటం ద్వారా ప్రాజెక్టుపై ప్రతికూలత తేవాలన్నది కొందరి ఆలోచన అని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు.. 

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ