మరికాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా, గాంధీభవన్ వద్ద భారీ భద్రత

By Nagaraju TFirst Published Nov 12, 2018, 8:58 PM IST
Highlights

ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాకు ఆమోదం లభించింది. వరుస వాయిదాలు వేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ జాబితాకు ఏఐసీసీ ఆమోద ముద్ర వేసింది. 70 మంది అభ్యర్థుల జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఢిల్లీ: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాకు ఆమోదం లభించింది. వరుస వాయిదాలు వేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ జాబితాకు ఏఐసీసీ ఆమోద ముద్ర వేసింది. 70 మంది అభ్యర్థుల జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

సోమవారం సాయంత్రం పీసీసీ సమర్పించిన అభ్యర్థుల జాబితాపై యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై విస్తృతంగా చర్చించింది.  

ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ తోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. మెుత్తం పీసీసీ రెడీ చేసిన 74 మంది అభ్యర్థులపై చర్చించారు. అయితే వారిలో 70 మందికి ఏఐసీసీ ఆమోద ముద్ర వేసింది. 

దీంతో ఈ 70 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మరికాసేపట్లో విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. మిత్ర పక్షాల స్థానాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు ఊరిస్తూ వస్తున్న అభ్యర్థుల జాబితా మరికాసేపట్లోనే ఉందని తెలిసే సరికి ఆశావాహులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

టిక్కెట్లు విడుదల కాకపోయినప్పటికి తమ నాయకులకే టిక్కెట్ కేటాయించాలంటూ పలువురు మద్దతు దారులు గాంధీభవన్ వద్ద ఆందోళన చేస్తున్నారు. అయితే మరికాసేపట్లో అభ్యర్థుల జాబితా విడుదల కానున్న నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెడీ: జానా, రేవంత్‌లకు ఢిల్లీ పిలుపు

రేవంత్‌కు షాక్: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్‌దే పై చేయి

పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

click me!