నిరుద్యోగులకు సదవకాశం... ఎయిర్ టెల్,పేటియమ్, హ్యుందాయ్ కంపెనీల్లో ఉద్యోగాలు

Published : Nov 12, 2018, 07:58 PM ISTUpdated : Nov 12, 2018, 08:05 PM IST
నిరుద్యోగులకు సదవకాశం... ఎయిర్ టెల్,పేటియమ్, హ్యుందాయ్ కంపెనీల్లో ఉద్యోగాలు

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు నేతాజీ ఫౌండేషన్ ఓ సదవకాశాన్ని కల్పించింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత కోసం  టీమ్ వీవర్స్ సంస్థ సహకారంతో ఉద్యోగ మేళా ఏర్పాటుచేసింది. ప్రైవేట్ రంగంలో అగ్రగామిగా నిలిచిన కంపనీలతో ఉద్యోగ మేళా నిర్వహించడానికి ఈ పౌండేషన్ ముందుకువచ్చింది.   

నవంబర్ 14వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో ఎయిర్ టెల్,పేటియమ్, హ్యుందాయ్, స్విగ్గి వంటి టాప్ కంపనీలు పాల్గొననున్నట్లు నిర్వహకులు తెలిపారు. ముఖ్యంగా బీకామ్ డిగ్రీ వున్న యువతీ యువకులు ఈ మేళాలో పాల్గొనవచ్చని ప్రకటించారు. గతంలో ఉద్యోగంచేసిన వారితో పాటు ప్రెషర్స్ కు కూడా అవకాశం కల్పించారు.  2 భాగాలుగా ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు....ఇందులో సెలెక్టయిన అభ్యర్థులకు మళ్లీ కంపనీలు ముఖాముఖి జరిపి ఉద్యోగాలు ఇస్తాయని  నిర్వహకులు తెలిపారు. 

సుమారుగా 100 ఉద్యోగాల భర్తీ కోసం మాత్రమే ఈ ఉద్యోగ మేళా జరుగుతోందని....ఈ అవకాశాన్ని  యువత సద్వినియోగం చేసుకోవాలని నేతాజీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఇంటర్వ్యూ కోసం ఈ నెల 14 వ తేదీన ఉదయం నాంపల్లి పబ్లిక్ గార్డెన్ రోడ్‌లోని టీంవివర్స్ ఆఫీసుకు రావాలని ఓ ప్రకటన జారీ చేశారు.  

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?