Asianet News TeluguAsianet News Telugu

సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  అలకబూనారు. సీట్ల కేలాయింపులో  తన  వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని సమాచారం

congress party working president revanth reddy unhappy over seats allocation
Author
Hyderabad, First Published Nov 9, 2018, 2:04 PM IST


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  అలకబూనారు. సీట్ల కేలాయింపులో  తన  వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఒకానొక దశలో తాను కూడ పోటీ నుండి తప్పుకొంటానని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పినట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ  అధిష్టానం పునరాలోచనలో పడిందని  సమాచారం.
 

టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో  తనకు ఇచ్చిన హమీని సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పాటించలేదని రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని  సమాచారం. తనకు ఇచ్చిన హమీని అమలు చేయాలని రేవంత్ రెడ్డి పార్టీ నాయకత్వం  వద్ద డిమాండ్ పెట్టారని సమాచారం.

రెండు రోజుల క్రితం  జరిగిన కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నుండి కూడ రేవంత్ రెడ్డి అర్ధాంతరంగా బయటకు వచ్చారు. ఆ తర్వాత సాయంత్రం సమావేశానికి హాజరయ్యారు. 

కానీ  ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి సరైన స్పందన రాలేదు. దీంతో  తాను కూడ పోటీ నుండి తప్పుకొంటానని రేవంత్ రెడ్డి ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పినట్టు  సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం పునరాలోచన పడినట్టు  సమాచారం. 

అవసరమైతే తాను కూడ కొడంగల్ నుండి పోటీ నుండి తప్పుకొంటానని ప్రకటించినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో  రేవంత్ కొంత గట్టిగానే తన వాదనను విన్పించినట్టు  సమాచారం. ఒకానొక దశలో  రేవంత్ పార్టీ అధిష్టానంతో  గొడవకు దిగినట్టు సమాచారం..కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో పెట్టిన సుమారు 20కు పైగా స్థానాల్లో  రేవంత్ రెడ్డి వర్గానికి చెందినవే ఎక్కువగా ఉన్నాయి.

పెండింగ్‌లో రేవంత్ రెడ్డి వర్గం సీట్లు  ఇవే

సూర్యాపేట -పటేల్ రమేష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ -  వేం  నరేందర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ -  అరికెల నర్సా రెడ్డి, ఆర్మూర్ -రాజారామ్ యాదవ్, చెన్నూరు  -బోడ జనార్దన్, దేవరకొండ -బిల్యా నాయక్, ఎల్లారెడ్డి -సుభాష్ రెడ్డి, ఇల్లందు - హరిప్రియ

 

సంబంధిత వార్తలు

స్క్రీనింగ్ కమిటీ షాక్... భేటీ మధ్యలోంచి రేవంత్ బయటకు...

కేసీఆర్ తాగుబోతు, కర్రు కాల్చి కారు గుర్తుకు వాత పెట్టండి: రేవంత్ రెడ్డి

పట్నం బ్రదర్స్ పై రేవంత్ రెడ్డి సీరియస్ ఆరోపణలు

రేవంత్‌కు సెక్యూరిటీ పెంపు: 4+4 గన్‌మెన్లతో భద్రత

రేవంత్‌కి భద్రతను పెంచమన్న హైకోర్టు.. కేంద్రానిదే బాధ్యత

Follow Us:
Download App:
  • android
  • ios