పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు
వరంగల్ జిల్లాలోని వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ సీట్లను టీడీపీ, టీజేఎస్‌లకు కేటాయిస్తున్నారనే ప్రచారం రావడంతో వరంగల్ డీసీసీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు స్వీయ నిర్భంధంలో ఉన్నారు.
వరంగల్: వరంగల్ జిల్లాలోని వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ సీట్లను టీడీపీ, టీజేఎస్‌లకు కేటాయిస్తున్నారనే ప్రచారం రావడంతో వరంగల్ డీసీసీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు స్వీయ నిర్భంధంలో ఉన్నారు.
స్వీయ నిర్భంధంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలను నిరసన విరమించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు కోరారు.
సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు వరంగల్ డీసీసీ కార్యాలయానికి వచ్చి నిరసన కారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. నిరసనను విరమించాలని కోరారు.
ఈ రెండు సీట్లు మిత్రపక్షాలకు వదలకుండా కాంగ్రెస్ పార్టీయే తీసుకోవాలని వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.వరంగల్ జిల్లాలో పార్టీని కాపాడుకొంటున్న వస్తున్న డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి కోసం వరంగల్ పశ్చిమ సీటును ఆశిస్తున్నారు.
ఈ నియోజకవర్గం పరిధిలో పాదయాత్రలు కూడ రాజేందర్ రెడ్డి చేశారు.ఈ సీటు మిత్రపక్షాలు వెళ్లే అవకాశం ఉందని తెలియడంతో రాజేందర్ అసంతృప్తితో ఉన్నారు.
మిత్రపక్షాల నేతలతో ఈ విషయాన్ని తాను మాట్లాడుతానని కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పార్టీ కోసం అనేక త్యాగాలు చేశారని ఆయన చెప్పారు.
మిత్రపక్షాలకు కాకుండా కాంగ్రెస్ పార్టీయే ఈ రెండు స్థానాల్లో పోటీ చేసేలా తాను పార్టీ నాయకత్వంతో పాటు మిత్రపక్షాలతో కూడ చర్చిస్తానని వి.హనుమంతరావు హమీ ఇచ్చారు. నిరహరదీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు వెంటనే తమ దీక్షలను విరమించాలని ఆయన కోరారు.
సంబంధిత వార్తలు
ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్