రివర్స్ టెండరింగ్ పై జగన్ కు షాక్: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 22, 2019, 5:52 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
 

జగన్ ను ప్రజలు చీదరించుకుంటున్నారు, కేంద్రానికి రాసిన లేఖను బహిర్గతం చేయాలి: దేవినేని ఉమా

సీఎం జగన్మోహన్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తూ తమ నేతలకు ఫలానా ప్రాంతంలో భూములు కొనుక్కోమని చెప్పారా లేదా అని ప్రశ్నించారు. మీకు సీట్లు ఇవ్వలేకపోయా, అక్కడ భూములు కొనండి, లాభం జరుగుతుందని చెప్పింది వాస్తవం కాదా? మీరు రాజధాని మార్చటానికి కేంద్రం అనుమతి తీసుకున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.  
 

జగన్ మరో సంచలన నిర్ణయం: ఏపీ ప్రణాళిక బోర్డు రద్దు

ఇకపోతే విజయనగరం కేంద్రంగా శ్రీకాకుళం, విశాఖపట్నం రీజినల్ బోర్డు, కాకినాడ కేంద్రంగా ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలు కలిపి ఒక బోర్డు, గుంటూరు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు మూడు జిల్లాలకు కలిపి ఒక బోర్డును ఏర్పాటు చేయనుంది. 
 

జగన్ అలా చరిత్రలో ఎక్కకూడదని భగవంతుడిని కోరుకుంటున్నా: కేశినేని నాని

అమరావతి రాజధానిపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో కేశినేని నాని ఇలాంటి వ్యాఖ్యలు ట్విట్టర్ వేదికగా  చేసినట్లు తెలుస్తోంది. రాజధాని తరలిపోతుంది, వైసీపీ రాజధానిని వేరో ప్రాంతానికి తరలించబోతుంది అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో కేశినేని నాని రాజధాని మార్చొద్దంటూ పరోక్షంగా సూచించారు. 

 

లైసెన్స్ డ్ గన్ తో కాల్చుకుని చనిపోవాలనుకున్నా: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఈ మధ్య తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పదుల సంఖ్యలో చనిపోయినప్పుడు చాలా బాధేసిందన్నారు. వారికి అన్నయ్యలాంటి వారు ధైర్యం చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదేమో అని పవన్ స్పష్టం చేశారు. యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా అంటే ఆవేశంతో ఊగిపోయేవాడినని చెప్పుకొచ్చారు. 
 

విదేశీ బ్యాంకుల షాక్: పిపిఎల రద్దుపై వెనక్కి తగ్గిన జగన్ సర్కార్

పీపీఏల విషయంలో జగన్ సర్కార్ వెనక్కు తగ్గింది. చంద్రబాబునాయుడు సర్కార్ పీపీఏలతో ప్రజాధనాన్నిదుర్వినియోగం చేసిందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

 

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

పొలవరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు నిర్ణయంపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని ఆయన విమర్శించారు.

 

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

ఆనాటి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపులో అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్ బాబు పాత్ర ఉందంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగా చీఫ్ మార్షల్ గణేష్ బాబుపై తొలివేటు వేసింది. 

 

అమరావతిలోనే రాజధాని, అలా చెప్పలేదు: మంత్రి గౌతం రెడ్డి

అమరావతిని మార్చబోమని ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. 

 

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పంట నష్టపోయి దాదాపు 10వేల కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని గల్లా చెప్పారు. రాజధాని అమరావతిపై మంత్రులు తలో రకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ కి మోదీ, అమిత్ షా మద్దతు ఉందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుపట్టారన్న విషయాన్నిఈ సందర్భంగా గల్లా గుర్తు చేశారు.
 

విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై దాడి పెంచిన బీజేపీ నేతలు

గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో ఏకపక్షంగా వెళ్లొద్దని చెబుతూనే ఉన్నామన్నారు. 

 

జగన్‌తో స్నేహం, కేసీఆర్ తో కయ్యం: బీజేపీ ప్లాన్ ఇదీ.....

దక్షిణాదిలో బలపడేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఏపీ రాష్ట్రం కంటే తెలంగాణపై బీజేపీ ఎక్కువగా కేంద్రీకరించింది.

 

టీఆర్ఎస్ లో కలకలం రేపిన ఓ వార్త:యూ ట్యూబ్ ఛానెల్ పై డీజీపికి ఎమ్మెల్యే ఫిర్యాదు

ఆ వీడియోను చూసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆ ఛానెల్ యాజమాన్యంపై రాష్ట్ర డీజీపీకి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు నిరాధారమైన కథనాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ కథనాల వల్ల తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 

వరినాటు మహిళలతో సీతక్క ముచ్చట్లు: కూలీల పచ్చడితో ఎమ్మెల్యే భోజనం

పచ్చళ్లు తిని చాలా రోజులవుతుందని కూలీలతో అన్నారు. నాకూ కాస్త వడ్డించండి అక్కా అంటూ అడిగారు. వరినాటు కూలీలతో కలిసి రోడ్డుపై భోజనం చేసి వెళ్లిపోయారు. చేతులు కడుక్కుంటూ పచ్చడి చాలా బాగుందంటూ వారికి కితాబిచ్చారు ఎమ్మెల్యే. 

 

హీరో రాజ్ తరుణ్ కు భారీ షాక్: వీడియో సాక్ష్యాలను బయటపెట్టిన కార్తీక్

సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకొంది. రాజ్ తరుణ్ కారు ప్రమాదం చోటు చేసుకొన్నఘటనను స్థానికుడు కార్తీక్  రికార్డు చేశాడు. అయితే ఈ విషయమై కార్తీక్ కు రాజ్ తరుణ్ తరపు వ్యక్తులు బెదిరించారు.


సాహో అడ్వాన్స్ బుకింగ్స్.. డోస్ మాములుగా లేదు

ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం సాహో ఈ నెల 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

 

హాట్ హీరోయిన్ కొంగుతో ప్రభాస్ స్టెప్పులు..

బాలీవుడ్ లో కూడా సాహో భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండడంతో యాక్టర్ ప్రభాస్ గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.; సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువవ్వాలని న్యూస్ ఛానెల్స్ లోనే కాకుండా రియాలిటీ షోల్లో కూడా రెబల్ స్టార్ సందడి చేస్తున్నాడు. 

 

'సాహో'కి నారా లోకేష్ సపోర్ట్.. ట్రోల్ చేస్తోన్న టీడీపీ ఫ్యాన్స్!

ఆగష్టు 30న విడుదల కాబోతున్న సాహో చిత్రం కోసం దేశం మొత్తం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై అప్పుడే రాజకీయ వివాదాలు కూడా మొదలయ్యాయి. 
 

రెమ్యునరేషన్ కోసం బిగ్ బాస్ కంటెస్టంట్ బెదిరింపులు!

‘బిగ్‌ బాస్‌’ రియాల్టీ షోలో నటించినందుకు బాకీ ఉంచిన పారితోషికాన్ని ఇవ్వాలని బెదిరించిన నటి మధుమితపై విజయ్‌ టీవీ మేనేజర్‌ ప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

అప్పట్లో రెమ్యునరేషన్ తో షాకిచ్చిన మెగాస్టార్

కొండవీటి దొంగ, కొదమ సింహం, జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాల తరువాత మెగాస్టార్ చిరంజీవి స్థాయి అప్పట్లో ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులు మెగాస్టార్ దెబ్బకు తుడిచిపెట్టుకొని పోయాయి. 

 

మీడియాపై దుమ్మెత్తిపోస్తున్న అనుష్క.. మన ఊపిరి ఆగిపోతోంది!

ప్రపంచ పర్యావరణంలో ఇప్పటికే సమతుల్యత లోపించింది. కాలుష్యంతో జీవరాశులకు ప్రాణాధారమైన ఆక్సిజన్ శాతం తగ్గుతోంది. ఇలాంటి సమయంలో మరో విపత్తు లాంటి సంఘటన బ్రెజిల్ లో జరిగింది. భూమిపైన ఉండే ఆక్సిజెన్ లో 20 శాతం బ్రెజిల్ లోని అమెజాన్ అడవుల నుంచే అందుతోంది. 

 

మహేష్, బన్నీలతో కళ్యాణ్ రామ్ పోటీ.. కారణం అతడేనా..?

ఓవైపు మహేష్ బాబు సినిమా బరిలో ఉంది. మరోవైపు బన్నీ సినిమా పోటీలో నిలిచింది. సంక్రాంతి బరిలో ఇలాంటి రెండు పెద్ద సినిమాల మధ్య తమ సినిమాను రిలీజ్ చేయాలని మరో హీరో అనుకోడు
 

'సై రా' : పవన్ వాయిస్ ఓవర్ పై ట్రోలింగ్!

'సైరా' టీజర్‌తో సురేందర్‌ రెడ్డి తన సత్తా చాటుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎలా మలుస్తాడో అనే అనుమానాలని పటాపంచలు చేసాడు. అలాగే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'గా చిరంజీవి ఈ వయసులో ఎలా వుంటారో అనేదానిపై కూడా సందేహాలు వదిలిపోయాయి. 
 

సాహో సెన్సార్ రిపోర్ట్.. టాక్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సాహో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇక చిత్ర యూనిట్ గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తోంది. బాలీవుడ్ లో ప్రభాస్ శ్రద్ధ కపూర్ తో కలిసి రియాలిటీ షోల్లో కూడా పాల్గొంటున్నాడు. 

 

అలియా భట్.. బన్నీని రిజెక్ట్ చేసిందా..?

బన్నీ-దిల్ రాజు, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ప్లాన్ చేస్తున్న సినిమా ఐకాన్. ఇప్పుడు ఈ సినిమా కోసం హీరోయిన్ వేట ప్రారంభమైంది. ఈ సినిమాకు ఓ రేంజ్ హీరోయిన్ కావాలన్నది బన్నీ కోరికగా తెలుస్తోంది. 

 

కోన భారీ స్కెచ్.. రూ.500 కోట్లతో ఫిల్మ్ స్టూడియో!

కోన వెంకట్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో వరల్డ్ క్లాస్ ఫిలిం స్టూడియోని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. వాటర్ పార్క్ థీమ్ తో సూర్యలంకలో ఈ ఫిలిం స్టూడియోను ఏర్పాటు చేయాలని భారీ ప్లాన్ వేస్తున్నాడు. వైఎస్సాసీపీ గవర్నమెంట్తో పాటు ఓ అంతర్జాతీయ కంపనీ కూడా ఈ నిర్మాణంలో భాగం కాబోతుందని సమాచారం.

 

అరవింద సమేతతో మొదలు.. ఏంటీ దూకుడు!

అందాల రాక్షసి చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా ఎమోషనల్ ఫెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఆ తర్వాత నవీన్ చంద్ర హీరోగా కొన్ని చిత్రాల్లో నటించినా ఆశించిన  దక్కలేదు. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నవీన్ ప్రయత్నించాడు. ఆ చిత్రాలు కూడా నిరాశనే మిగిల్చాయి.

click me!