కొండవీటి దొంగ, కొదమ సింహం, జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాల తరువాత మెగాస్టార్ చిరంజీవి స్థాయి అప్పట్లో ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులు మెగాస్టార్ దెబ్బకు తుడిచిపెట్టుకొని పోయాయి. 

మెగాస్టార్ 64వ పుట్టినరోజు సందర్బంగా ఎన్నో విషయాలను అభిమానులు గుర్తు   చేసుకుంటున్నారు. ఇక ఇన్నేళ్ల కెరీర్ లో మెగాస్టార్ గురించి ప్రత్యేకంగా నిలిచింది మరొకటి ఉంది. 1992లో ప్రముఖ ఇంగ్లిష్ మ్యాగజిన్ కవర్ పేజీపై మెగాస్టార్ బొమ్మ దర్శనమివ్వడం అప్పట్లో వెరీ స్పెషల్. అయితే అందులో బిగ్గెర్ దెన్ బచ్చన్ అనే టైటిల్ తో మెగాస్టార్ ఒక సినిమాకు 1.25కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు చెప్పారు. 

ఆ న్యూస్ దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ఆ తరువాత మెగాస్టార్ చాలా సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. ఇక ప్రతిబంధ్, ఆజ్ కా గుండా రాజ్, ది జెంటిల్మెన్ వంటి సినిమాలతో మెగాస్టార్ బాలీవుడ్ ఆడియెన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ 20 ఏళ్ల తరువాత సైరా సినిమాతో నార్త్ ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు.