స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ నో చెప్పినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. బన్నీ హీరోగా దర్శకుడు వేణుశ్రీరాం ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి 'ఐకాన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సినిమాకి కొన్ని అదనపు ఆకర్షణలు యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నుండి హీరోయిన్ ని దింపాలని చూస్తున్నారు. బన్నీ సలహా మేరకు నిర్మాత దిల్ రాజు.. స్టార్ హీరోయిన్ అలియాభట్ తో సంప్రదింపులు జరిపారు. అయితే అక్కడ నుండి సానుకూల సమాధానం లేకపోవడంతో ఇప్పుడు మరో హీరోయిన్ కోసం చూస్తున్నారు.

అలియా ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతోంది. ఇప్పటికే తెలుగులో మెగాహీరో రామ్ చరణ్సరసన 'RRR'లో నటిస్తోంది. బాలీవుడ్ లో తనకు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా మరో తెలుగు సినిమా అంగీకరించే స్టేజ్ లో ఆమె లేదు.  ఆ కారణంగానే బన్నీ సినిమాను రిజెక్ట్ చేసిందని చెబుతున్నారు.

ఈమెకు బదులుగా శ్రద్ధా కపూర్ ని తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' అనే సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత వేణుశ్రీరాం సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.