ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం సాహో ఈ నెల 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబందించిన స్పెషల్ పోస్టర్స్ తో చిత్ర యూనిట్ అభిమానుల్లో అంచనాల డోస్ ని పెంచేస్తోంది. 

ఇక సినిమా టికెట్స్ ఆన్లైన్ లోకి అందుబాటులోకి వస్తే నిమిషాల్లో దోచేసేలా కనిపిస్తున్నారు. లోకల్ గానే కాకుండా విదేశాల్లో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ సాహో సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా మొదటి రోజు అన్ని స్క్రీన్స్ హౌస్ ఫుల్ అయ్యేలా కనిపించనున్నాయట. 

ప్రీమియర్ షోల గురించి అయితే స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాలోని సిడ్నీ , మెల్ బోర్న్ వంటి నగరాల్లో తెలుగు వారి సంఖ్య అధికంగానే ఉంది. దీంతో అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ జోష్ గట్టిగానే కనిపిస్తోంది. ఈ సారి సాహో ఓవర్సీస్ కలెక్షన్స్ ద్వారా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఉందని చెప్పవచ్చు.