Asianet News TeluguAsianet News Telugu

హీరో రాజ్ తరుణ్ కు భారీ షాక్: వీడియో సాక్ష్యాలను బయటపెట్టిన కార్తీక్

సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకొంది. రాజ్ తరుణ్ కారు ప్రమాదం చోటు చేసుకొన్నఘటనను స్థానికుడు కార్తీక్  రికార్డు చేశాడు. అయితే ఈ విషయమై కార్తీక్ కు రాజ్ తరుణ్ తరపు వ్యక్తులు బెదిరించారు.
 

raj tarun car accident:kartik reavels video evidence on
Author
Hyderabad, First Published Aug 22, 2019, 4:41 PM IST

హైదరాబాద్:  సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకొంది. రాజ్ తరుణ్ కారు ప్రమాదం చోటు చేసుకొన్నఘటనను స్థానికుడు కార్తీక్  రికార్డు చేశాడు. అయితే ఈ విషయమై కార్తీక్ ను రాజ్ తరుణ్ తరపు వ్యక్తులు బెదిరించారు. తనను బెదిరించిన విషయమై  పోన్ ఆధారాలు ఉన్నాయని కార్తీక్ చెబుతున్నాడు.

ఈ నెల 20వ తేదీన  సినీ నటుడు రాజ్ తరుణ్ కారు అలకాపురి సమీపంలో ప్రమాదానికి గురైంది. కారు ప్రమాదం గురైన తర్వాత రాజ్ తరుణ్  పరుగెత్తుకొంటూ వెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీల్లో కూడ రికార్డయ్యాయి..రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన తర్వాత  స్థానికుడు కార్తీక్ ఈ ప్రమాద దృశ్యాలను రికార్డు చేశాడు.ప్రమాదం చేసిన తర్వాత  రాజ్ తరుణ్  ను కార్తీక్  పట్టుకొన్నాడు. 

కారు ప్రమాదాన్ని తాను ఇంటి బాల్కనీ నుండి చూసినట్టుగా కార్తీక్ చెప్పాడు. ప్రమాదం జరిగిన కారు నుండి ఓ వ్యక్తి పారిపోతూ ఉండడాన్ని చూసి హత్య చేసి పారిపోతున్నాడా అని భావించి తాను అతడిని పట్టుకొన్నట్టుగా కార్తీక్  తెలిపారు.

కారు ప్రమాదానికి గురైన తర్వాత పారిపోతున్న రాజ్ తరుణ్ ను తాను  పట్టుకొన్నట్టుగా కార్తీక్ చెప్పారు. తానే రాజ్ తరుణ్ ను ఇంటి వద్దే దింపినట్టుగా కార్తీక్ చెప్పారు. మద్యం తాగి రాజ్ తరుణ్ కారు నడిపినట్టుగా  తనకు చెప్పాడని కార్తీక్ వివరించాడు.ఈ సమయంలోనే  తామిద్దరం కూడ ఫోన్ నెంబర్లను తీసుకొన్నట్టుగా కార్తీక్ తెలిపారు.

తాను ఇంటికి వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనకు ఫోన్ చేస్తే ప్రమాదం గురించి అడిగినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. అయితే ప్రమాదం జరిగిన తీరును రాజ్ తరుణ్ తనకు పూసగుచ్చినట్టుగా చెప్పారని కార్తీక్ వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత సంఘటన స్థలంలో తాను తీసిన వీడియోను డిలీట్ చేయాలని రాజ్ తరుణ్ తనను కోరినట్టుగా కార్తీక్ మీడియాకు తెలిపారు.

మరునాడు తనకు తన మేనేజర్ రాజా రవీంద్ర ఫోన్ చేస్తాడని రాజ్ తరుణ్ చెప్పారని... రాజ్ తరుణ్ చెప్పినట్టుగానే రాజా రవీంద్ర తనకు ఫోన్ చేశారని కార్తీక్ తెలిపారు. ఈ వీడియోలను డిలీట్ చేస్తే తననకు డబ్బులు ఇస్తారని చెప్పారని ఆయన తెలిపారు. తన వద్ద ఉన్న వీడియోలను డిలీట్ చేయాలని  రాజ్ తరుణ్ తరపున వ్యక్తులు కోరారు. రాజ్ తరుణ్ తో పాటు   మేనేజర్  రాజా రవీంద్ర ఫోన్ చేసినట్టుగా కార్తీక్ చెప్పారన్నారు.

తనకు డబ్బులు ఇస్తాననని రాజా రవీంద్ర కూడ చెప్పారన్నారు. తనతో రాజ్ తరుణ్ తరపున మాట్లాడిన కొందరు బెదిరించారని కార్తీక్ చెప్పారు.ఈ ఆడియో సంభాషణలు కూడ ఉన్నాయన్నారు. అంతేకాదు ఓ మహిళ తనకు ఫోన్ చేసి ఈ వీడియోలను డిలీట్ చేయాలని కోరిందన్నారు. ఈ విషయమై ఆమె తనను అసభ్యంగా దూషించిందని కూడ ఆయన ఆవేదన చెందారు. 

రాజ్ తరుణ్ నిజ స్వరూపాన్ని బయటపెట్టేందుకే తాను ఈ విషయాన్ని పోలీసులకు చెప్పలేదని కార్తీక్ చెప్పారు.ఈ విషయాన్ని ఓ తెలుగు న్యూస్ ఛానెల్  బయటపెట్టింది. రాజ్ తరుణ్ తరపున తనతో మాట్లాడిన వారితో ఒప్పందం కుదుర్చుకొనేలా మాట్లాడడం వెనుక కూడ  ఈ కారు ప్రమాదానికి కారణం ఎవరు... ఈ ప్రమాదం ఎలా నీరుగారిపోయే అవకాశం ఉందనే విషయాన్ని సమాజానికి తెలిపేందుకే తాను వీటిని రికార్డు  చేసినట్టుగా  కార్తీక్ తెలిపారు. 

 

 
సంబంధిత వార్తలు

యాక్సిడెంట్ ఎఫెక్ట్: రాజ్ తరుణ్ పై కేసు నమోదు..!

తాగి డ్రైవ్ చేశావా..?' నెటిజన్ ప్రశ్నపై రాజ్ తరుణ్ రియాక్షన్!

రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

కారు వదిలేసి పారిపోయిన రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?

రాజ్ తరుణ్ పారిపోవడంపై పోలీసుల అనుమానాలు ఇవే!

యాక్సిడెంట్ ఘటనపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్

Follow Us:
Download App:
  • android
  • ios