టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సాహో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇక చిత్ర యూనిట్ గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తోంది. బాలీవుడ్ లో ప్రభాస్ శ్రద్ధ కపూర్ తో కలిసి రియాలిటీ షోల్లో కూడా పాల్గొంటున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే యూవీ క్రియేషన్స్ సినిమా సెన్సార్ పనులను ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. 

రెండు గంటల 54నిమిషాల నిడివితో ఉన్న సాహో సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. సెన్సార్ యూనిట్ నుంచి కూడా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు టాక్. సినిమాలో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రిలీజ్ పనుల్లో ఉన్న యూవీ క్రియేషన్స్ దేశ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకుంది. 

సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక ప్రభాస్ పాత్ర ద్వారా సినిమాలో వచ్చే ట్విస్ట్ అద్భుతంగా ఉందనే టాక్ వస్తోంది. మరి సినిమా ప్రభాస్ అభిమానులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఆగస్ట్ 30న సాహో తెలుగు హిందీ తమిళ్ మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది.