రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాపై రాజకీయ వివాదాలు మొదలయ్యాయి. ఓ మీడియా సంస్థలో టీడీపీ కార్యకర్తలు 'సాహో' సినిమాపై నెగెటివ్ 
ప్రచారం చేస్తున్నారనే కథనం వెలువడింది.

దానికి కారణాలుగా గతంలో కృష్ణంరాజు.. చంద్రబాబు నాయుడిని 'చచ్చిన పాము' అంటూ కామెంట్ చేశారని, ప్రభాస్.. వైఎస్సార్ పార్టీని కొనియాడడం వంటి విషయాలు టీడీపీ పార్టీ అభిమానులకు నచ్చక.. కొందరు కార్యకర్తలు 'సాహో' సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని స్టోరీ రాసుకొచ్చారు. దీనిపై నారా లోకేష్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇలాంటి అబద్దపు వార్తలు రాసి కనీసం అన్నం తినగలరా అంటూ విరుచుకుపడ్డారు.

ఆ తరువాత ట్వీట్ లో 'సాహో' భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న విజువల్ వండర్ చిత్రమని ఈ సినిమాను చూడడానికి తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు.. టీడీపీ కార్యకర్తలు, ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమాను చూడాలి అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. 'సాహో' సినిమాను లోకేష్ సపోర్ట్ చేయడం కొందరు పార్టీ అభిమానులకు నచ్చడం లేదు.

దీంతో సోషల్ మీడియాలో ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. 'లోకేష్, బాలకృష్ణ రాజకీయాలను అనర్హులని.. ఇది నిజమని.. వారిద్దరూ పార్టీకి దూరంగా ఉంటే మంచిదని' ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ 'మనకు సిగ్గు లేదా ప్రభాస్, కృష్ణంరాజు మన గురించి ఎంత తప్పుగా మాట్లాడారు.. అలాంటి వారికి సపోర్ట్ చేస్తున్నామా..?'అంటూ నారా లోకేష్ పై మండిపడ్డాడు. బాలకృష్ణ, ఎన్టీఆర్ ల సినిమాలపై కామెంట్స్ చేయని నారా లోకేష్ ఇప్పుడు ప్రభాస్ సినిమా మాత్రం సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు.