టాలీవుడ్ ప్రముఖ సీనియర్ రచయిత కోనవెంకట్ ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' అనే సినిమాను రూపొందిస్తున్నారు. అమెరికాలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. ఈ సినిమాలో నటుడు మాధవన్, హాలీవుడ్ స్టార్ మైకేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. కోన వెంకట్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో వరల్డ్ క్లాస్ ఫిలిం స్టూడియోని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. వాటర్ పార్క్ థీమ్ తో సూర్యలంకలో ఈ ఫిలిం స్టూడియోను ఏర్పాటు చేయాలని భారీ ప్లాన్ వేస్తున్నాడు. వైఎస్సాసీపీ గవర్నమెంట్తో పాటు ఓ అంతర్జాతీయ కంపనీ కూడా ఈ నిర్మాణంలో భాగం కాబోతుందని సమాచారం.

కోన ఇప్పటికే సూర్యలంకలో ల్యాండ్ సర్వే చేయడం మొదలుపెట్టాడు. తన ప్రాజెక్ట్ కి తగ్గట్లు ల్యాంగ్ దొరికిన వెంటనే నిర్మాణం మొదలుపెట్టేస్తాడు. కోన వెంకట్ సోదరుడు కోన రఘుపతి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యుటీ స్పీకర్ గా పని చేస్తున్నారు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టే కోన కూడా ఇంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ని టేకప్ చేశాడని  మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరో ఐదేళ్ల  సమయం పట్టడం ఖాయమని అంటున్నారు.