మహబూబాబాద్: వరినాటు కూలీలతో సందడి చేశారు మహబూబాబాద్ జిల్లా ములుగు ఎమ్మెల్యే సీతక్క. బుధవారం ఎమ్మెల్యే సీతక్క ఎంచగూడెం గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో కూలీలు రోడ్డుపై కూర్చుని భోజనం చేస్తున్నారు. 

రోడ్డుపై కూర్చుని భోజనం చేస్తున్న కూలీలను చూసిన ఎమ్మెల్యే సీతక్క వెంటనే కారు దిగారు. అక్కా బాగున్నారా అంటూ మహిళలను ఆప్యాయంగా పలకరించారు. ఎవరెవరు ఏం కూరలు తెచ్చుకున్నారంటూ అడిగి మరీ తెలుసుకున్నారు. 

అంతా పచ్చడి తెచ్చుకున్నామని చెప్పారు. పచ్చళ్లు తిని చాలా రోజులవుతుందని కూలీలతో అన్నారు. నాకూ కాస్త వడ్డించండి అక్కా అంటూ అడిగారు. వరినాటు కూలీలతో కలిసి రోడ్డుపై భోజనం చేసి వెళ్లిపోయారు. చేతులు కడుక్కుంటూ పచ్చడి చాలా బాగుందంటూ వారికి కితాబిచ్చారు ఎమ్మెల్యే. 

ఎమ్మెల్యే సీతక్క ఆప్యాయంగా పలకరించడం, వారితో కలిసి భోజనం చేయడంతో కూలీలంతా ఆనందం వ్యక్తం చేశారు. సీతక్కను పొగడ్తలతో ముంచెత్తారు. మీతో కలిసి భోజనం చేసే అవకాశం ఇచ్చారు అందుకే మీకే ధన్యవాదాలు అంటూ వెళ్లిపోయారు ఎమ్మెల్యే సీతక్క.

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టీసీ డ్రైవర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

విద్యార్థి అవతారం ఎత్తిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే: ఎల్ఎల్ఎం పరీక్షకు హాజరైన జీవన్ రెడ్డి