అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రణాళికా బోర్డును రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రణాళికా బోర్డుకు బదులు నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

ఈ నాలుగు ప్రాంతీయ బోర్డులో ఆయా ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధిపై ప్రభుత్వానికి నివేదిస్తోంది. అంతేకాదు ఆయా ప్రాంతీయ బోర్డు ప్రణాళిక పరిధిలో అసమానతలు, అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, సాగునీటి వంటి అంశాలను పర్యవేక్షుస్తోంది. 

ఇకపోతే విజయనగరం కేంద్రంగా శ్రీకాకుళం, విశాఖపట్నం రీజినల్ బోర్డు, కాకినాడ కేంద్రంగా ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలు కలిపి ఒక బోర్డు, గుంటూరు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు మూడు జిల్లాలకు కలిపి ఒక బోర్డును ఏర్పాటు చేయనుంది. 

కడప కేంద్రంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు మరో ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులకు నలుగురు ఎమ్మెల్యేలను కేబినెట్ హోదాతో నియమించనున్నారు. ప్రాతీయ బోర్డు చైర్మన్లు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. బోర్డు చైర్మన్ తోపాటు నలుగురు నిపుణులైన సభ్యులను బోర్డులో సభ్యులుగా నియమించనుంది.  దసరాలోపు ఈబోర్డుల ప్రక్రియ అమలులోకి రానుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ఆలోచన: నాలుగు ప్రాంతీయ బోర్డుల ఏర్పాటు

తండ్రి బాటలో...ప్రాంతీయ డెవలప్‌మెంట్ బోర్డుల ఏర్పాటు దిశగా జగన్

ఏపీలో 5 ప్రాంతీయ బోర్డుల ఏర్పాటు: ఛైర్మన్లు వీరే..!!