తమిళ బిగ్ బాస్ సీజన్ 3 వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఇప్పటికే హౌస్ నుండి ఇద్దరు కంటెస్టంట్లను బయటకి పంపించేశారు. వారిలో నటి మధుమిత ఒకరు. తోటి కంటెస్టంట్స్ తో మాటా మాటా పెరగడంతో మధుమిత బిగ్ బాస్ హౌస్ లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు.

ఆమె ప్రవర్తనతో షాక్ అయిన బిగ్ బాస్ టీమ్ హౌస్ నుండి ఆమెను బయటకి పంపించేశారు. అయితే ఈ రియాలిటీ షోలో పాల్గొన్నందుకు తనకు బాకీ ఉంచిన పారితోషికాన్ని ఇవ్వాలని మధుమిత విజయ్ టీవీ మేనేజర్ ని బెదిరించింది.

దీంతో అతడు మధుమితపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం నాడు స్థానిక గిండీ పోలీసులకు మధుమితపై కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన 
ప్రసాద్.. బిగ్ బాస్ షోలో పాల్గొన్న మధుమిత బయటకు వెళ్లే సమయంలో ఒప్పందం ప్రకారం రూ.11.5 లక్షల పారితోషికం ఇచ్చామని.. మిగతా ఎనభై వేలను రెండు రోజుల్లో ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానని తనను ఫోన్లో మధుమిత బెదిరించిందని.. అందువలనే ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు.