గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో ఏకపక్షంగా వెళ్లొద్దని చెబుతూనే ఉన్నామన్నారు.
సీఎం వైఎస్ జగన్ కి ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా మద్దతు ఉందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ ని తిప్పి కొట్టిన బీజేపీ నేతలు... తాజాగా మరోసారి దాడి పెంచారు. సీఎం జగన్ తాను తప్పులు చేసి వాటిని బీజేపీ పై నెట్టాలని చూస్తున్నారని ఆ పార్టీ నేత పురందేశ్వరి మండిపడ్డారు.
పీపీఏల రద్దు, పోలవరం రివర్స్ టెండర్లు జగన్ స్వయంకృతాపరాదమని అన్నారు. టీడీపీలాగే జగన్ కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆమె విమర్శించారు. పీపీఏల రద్దు విషయంలో కేంద్రం లేఖలు రాసినా జగన్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రతి నిర్ణయానికీ మోదీ, షా ఆశీస్సులు ఉన్నాయనడం అబద్ధమని పురంధేశ్వరి స్పష్టం చేశారు.
ఇదే విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో ఏకపక్షంగా వెళ్లొద్దని చెబుతూనే ఉన్నామన్నారు. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని చెప్పినా... జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
వారు చేసిన తప్పును ధైర్యంగా చెప్పుకోలేక కేంద్రంపై నెట్టడం సరికాదన్నారు. రివర్స్ టెండరింగ్ విషయంలో కేంద్రం సూచనలను జగన్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ నిర్ణయాలు తప్పని తేలిపోయిందని చెప్పారు. కనీసం పోలవరం అథారిటీ దృష్టికి కూడా ఏ విషయాలను తీసుకెళ్లలేదన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను కేంద్రంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని సూచించారు.
తాజా వార్తలు
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 22, 2019, 4:04 PM IST