బాలీవుడ్ లో కూడా సాహో భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండడంతో యాక్టర్ ప్రభాస్ గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.; సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువవ్వాలని న్యూస్ ఛానెల్స్ లోనే కాకుండా రియాలిటీ షోల్లో కూడా రెబల్ స్టార్ సందడి చేస్తున్నాడు. 

ఇకపోతే రీసెంట్ గా సల్మాన్‌ ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘నచ్‌ బలియే 9’ డ్యాన్స్‌ రియాల్టీ షోలో కూడా ప్రభాస్ హీరోయిన్ శ్రద్దా కపూర్ తో కలిసి సందడి చేశాడు. తనదైన స్టెపుల్లతో బి టౌన్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హైలెట్ ఏమిటంటే.. షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న హాట్ బ్యూటీ రవీనా టాండన్‌ చీర కొంగును నోటితో పట్టుకుని సల్మాన్ సినిమా ‘కిక్‌’లోని ‘జుమ్మేకీ రాత్‌ హై అనే పాటకు స్టెప్పులేశాడు. అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.