'జగన్‌కు మోడీ,అమిత్ షా ఆశీస్సులు': మరిన్ని వార్తలు

Published : Aug 21, 2019, 05:53 PM IST
'జగన్‌కు మోడీ,అమిత్ షా ఆశీస్సులు': మరిన్ని వార్తలు

సారాంశం

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.  

అమరావతిపై జగన్ సర్కార్ వ్యూహం: అసలుకే ఎసరు?

నిన్నటి విజయసాయిరెడ్డి ట్వీట్ చూసినా, మునిసిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడిన అంశాలను గమనించినా అనుమానం మాత్రం రాక మానదు. జగన్  ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అమరావతి శంకుస్థాపనకు రాలేదు. 

 

వరదలు ప్రభుత్వం సృష్టించిన విపత్తు, రైతులకు అండగా ఉంటాం: చంద్రబాబు

తన ఇల్లు అమరావతిని ముంచాలనే వైసీపీ కుట్ర పన్నిందని పదేపదే చంద్రబాబు ఆరోపించారు. దుర్మార్గపు నిర్ణయంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు  నిలదొక్కుకునే వరకు ప్రభుత్వం వారికి అండగా ఉండాల్సిందేన్నారు.

 

సమంత విషయంలో నాగ్ నిజంగానే కోపంగా ఉన్నారా?

మన్మధుడు 2 రిలీజ్ కు ముందు నుంచి సమంత వ్యూహాత్మకంగా మౌనంగా ఉంది. ఆ సినిమాలో ఆమె నటించినా ..ఆమెకు అసలు నచ్చలేందంటున్నారు. నాగ్ అలా అమ్మాయిల కోసం వెంపర్లాడే ప్లే బోయ్ పాత్రను ఆమె డైజస్ట్ చేసుకోలేకపోయిందని చెప్తున్నారు. 

 

రూ.600 చీర కట్టుకున్న కంగనా.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

కంగనా ఇటీవల ఎయిర్ పోర్ట్ లో చీర కట్టుకొని కనిపించింది. ఈ ఫోటో పోస్ట్ చేసిన రంగోలీ.. ఈ చీరను కంగనా కోల్‌కతాలో రూ.600 లకు కంగనా కొనుక్కుందని.. అంత తక్కువ  మొత్తానికే ఇంత మంచి క్వాలిటీతో చీరలు దొరుకుతాయని తెలిసి తను ఆశ్చర్యపోయిందని.. అయితే ఈ చీరలను నేసేవారు అంత తక్కువ సంపాదన కోసం ఎంత శ్రమిస్తారో అర్ధమై తను చాలా బాధ పడిందని ట్వీట్ చేసింది. 
 

'తాగి డ్రైవ్ చేశావా..?' నెటిజన్ ప్రశ్నపై రాజ్ తరుణ్ రియాక్షన్!

తాజాగా నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. ముందుగా ఓ నెటిజన్ 'తాగి కారు నడపడం వలనే యాక్సిడెంట్ అయిందా..?'అని ప్రశ్నించగా.. దానికి స్పందించిన రాజ్ తరుణ్ 'అదేం ప్రశ్న భయ్యా.. నేను తాగలేదు' అని బదులిచ్చాడు.

జగన్ మనుషులు అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

రాజధాని అమరావతి అంటేనే వైసీపీకి ఇష్టం లేదని ఆరోపించారు. అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అమరావతిని అడ్డుకుంటూనే ఉన్నారని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణం జరగకూడదని వైయస్ జగన్ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.  
 

సీఎం జగన్ బాహుబలి, మంత్రి గౌతంరెడ్డి సైరా నరసింహారెడ్డి: రోజా పొగడ్తలు

రాష్ట్రంలో 300 ఎంఎస్ఎం పార్కులు ఏర్పాటు చేయబోతున్నట్లు రోజా స్పష్టం చేశారు. ఇప్పటికే 33 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. స్థానికుల ఉద్యోగాల విషయంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై పారిశ్రామిక వేత్తలు ఆలోచించాలని హితవు పలికారు. 


ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

రాజధాని నిర్మాణ పనులను త్వరలో చేపడతామన్న మంత్రి బొత్స సత్యనారాయణ స్వరంలో మార్పుకు కారణం ఏంటి...? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఆరోపించినట్లు రాజధాని తరలిపోతుందా...? ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజలను పట్టి పీడిస్తున్నాయి.  
 

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

అమరావతిలో భూముల ధరలు భారీగా పడిపోయాయి. రాజధాని నిర్మాణం విషయంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

లవర్స్ మధ్య కోడిపకోడి చిచ్చు.... ప్రియుడు ఆత్మహత్య

ఆ రోజు రాత్రి ఫూటుగా మద్యం తాగిన శ్రీను ఆమెను కోడిపకోడి తినమని బతిమాలుతూ పలుమార్లు తినిపించే యత్నం చేశాడు.దీనికి ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆమెతో వివాదానికి దిగాడు. 

 

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ తనకు దేవాలయం వంటిదన్నారు ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, స్పీకర్‌గా ఉన్నన్ని రోజులు అసెంబ్లీలో పూజారిలా పనిచేశానని... వైసీపీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని కోడెల ఎద్దేవా చేశారు

 

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్

పోలవరం ప్రాజెక్టునిర్మాణ పనుల్లో తమ నిర్ణయాన్ని ఏపీ సర్కార్ సమర్ధించుకొంది. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్నిపీపీఏకు లేఖ రాసింది.

 

కొత్తగూడెంలో ఎన్ కౌంటర్... మావోయిస్టు మృతి

కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మావోయిస్టుల కూడా కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు

 

అమెజాన్‌ వరల్డ్స్ బిగ్గెస్ట్ క్యాంపస్.. భాగ్యనగరి మెడలో మణిహారం

చారిత్రక సంపదతో పాటు అనేక బహుళజాతి సంస్థలకు కేంద్ర స్థానంగా వున్న హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరింది. అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భాగ్యనగరిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌‌ బుధవారం ప్రారంభంకానుంది. 

 

అమరావతి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని  మార్పు  విషయమై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

 

విద్యార్థి అవతారం ఎత్తిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే: ఎల్ఎల్ఎం పరీక్షకు హాజరైన జీవన్ రెడ్డి

ఎల్ఎంఎల్ చివరి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్ష రాశారు. ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు రాసేందుకు జీవన్ రెడ్డి బుధవారం ఉదయమే వరంగల్ చేరుకున్నారు. కళాశాలలో జరిగిన గ్రూప్ డిస్కషన్లో పాల్గొని పరీక్షకు హాజరయ్యారు. 
 

తిని కూర్చోవడం వల్ల లావైపోలేదు.. ట్రోలింగ్ పై నిత్యామీనన్ రియాక్షన్!

మా నటులకు ఎలాంటి బద్ధకం ఉండదు’ అని అంటున్నారు సినీ నటి నిత్యామేనన్‌. ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు నిత్యా. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో  భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది నిత్యా. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసే ఫోటోలపై వచ్చే కామెంట్లు, నెటిజన్ల ట్రోలింగ్ గురించి మాట్లాడారు.

 

హాట్ సీన్లపై కత్తిరింపు.. హర్ట్ అయిన కాజల్!

'క్వీన్' తమిళ రీమేక్ లో హాట్ సీన్లు ఆ సినిమా ట్రైలర్ విడుదల అప్పుడే చర్చనీయాంశంగా నిలిచాయి. ఆల్మోస్ట్ అసభ్యంగా ఉన్న ఆ సీన్లను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అడాల్ట్ రేటెడ్ సినిమాల్లో కూడా అలాంటి సీన్లు ఉండవు. 

 

'సై రా' టీజర్ పై అల్లు బ్రదర్స్ సైలెన్స్.. ఏం జరుగుతోంది..?

తాజాగా విడుదలైన 'సై రా' టీజర్ గురించి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడారు. టీజర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

 

అతడి వల్ల నా జీవితమే మారిపోయింది.. ఎన్టీఆర్ హీరోయిన్ కామెంట్!

సౌత్, హిందీ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది సమీరా రెడ్డి. అందం, అభినయంతో సినీ అభిమానులని అలరించింది. 2014లో వివాహం తర్వాత సమీరా రెడ్డి వెండి తెరకు దూరంగా ఉంటోంది. భార్యగా, తల్లిగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. 

కార్మికులను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తాం: కేటీఆర్

రాబోయే రోజుల్లో నేతన్నలకు గౌరవం, భద్రతతో కూడిన జీవనోపాధి కల్పించనున్నట్లు తెలిపారు. సిరిసిల్లలో రూ.40.50 కోట్ల మీటర్ల క్లాత్ కు తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. 

 

'ఆర్ఆర్ఆర్': ఎన్టీఆర్ కు హీరోయిన్ ఫిక్సైంది...కానీ

బ్రిటన్ నటిని ఎన్టీఆర్ సరసన ఫైనలైజ్ చేసారు. పేరు ఇంకా బయిటకు రాలేదు కానీ రీసెంట్ గానే ఈ  పక్రిక పూర్తైనట్లు తెలుస్తోంది. బ్రిటన్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి ఆమె అని, ఇప్పుడు ‘RRR’ సినిమా ద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతోంది అని తెలుస్తోంది.  అక్టోబర్ నుంచి ఆమె షూట్ లో పాల్గొననుంది. 

 

47ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో

వరల్డ్ వైడ్ గా అత్యధిక అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటీనటుల్లో డ్వేన్ జాన్సన్ ఒకరు.రెజ్లింగ్ (WWE) ద్వారా అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకొని జనల చేత ముద్దుగా ది రాక్ అని పిపించుకున్నాడు. అయితే ఈ 47 ఏళ్ల స్టార్ సీక్రెట్ గా రెండో వివాహం చేసుకున్నాడు. 

 

లోకేష్! ఆ విషయంలో చంద్రబాబును మించిపోయారు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

పడవను అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచేశారని మాజీమంత్రి నారా లోకేష్‌ చేసిన వాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. నెల్లూరు నగరంలో పేదల ఇళ్లు తొలగించే ప్రసక్తే లేదని మంత్రి అనిల్‌ హామీ ఇచ్చారు. 
 

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

‘‘అసెంబ్లీ నుంచి ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన కోడెలపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదు చేయాలి. స్పీకర్ స్థానంలో ఉండి దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీశాడు. కోడెల, ఆయన దూడలను ఇప్పటికైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం ఉందా బాబు గారు’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

 

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

పోలవరం, అమరావతి పేరుతో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటిరాంబాబు స్పష్టం చేశారు.

ఈ రికార్డుల చరిత్ర.. చిరు నుంచే మొదలయ్యింది

కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు.

 

'స్పైడర్‌ మ్యాన్‌' ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!


ఇకపై మార్వేల్ స్టూడియోస్ లో 'స్పైడర్ మ్యాన్'ని చూడలేమట. మంగళవారం నాడు హాలీవుడ్ ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయాన్ని ప్రచురించింది. మార్వేల్ కి సోనీ సంస్థకి మధ్య స్పైడర్ మ్యాన్ సిరీస్ కి సంబంధించిన డీల్ ముగిసిపోనుంది.

 

యాక్సిడెంట్ ఘటనపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్

మంగళవారం తెల్లవారుజామున నార్సింగి వద్ద అల్కాపూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన తరువాత రాజ్ తరుణ్ కారు దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయినట్లు పోలీసులు సిసి టివి ఫుటేజ్ ద్వారా కనుగొన్నారు. 


యాంకర్ సుమకి ఇంత డబ్బు పిచ్చా.. కూర్చోబెట్టి కడిగేశారు!

ఎందరు కుర్ర యాంకర్లు వచ్చినా సీనియర్ యాంకర్ సుమకు ఉండే క్రేజే వేరు. బుల్లితెరపై, ప్రీరిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్ ఎక్కడా చూసిన సుమ పలుకులే వినిపిస్తుంటాయి. స్పాంటేనియస్ యాంకర్ గా సుమకు మంచి గుర్తింపు ఉంది. బుల్లి తెరపై మహిళలకు నచ్చే ప్రోగ్రాం వస్తోందంటే అందులో యాంకర్ సుమ అని చెప్పడంలో సందేహం లేదు. 
 


 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !