బాలీవుడ్ లో కంగనా సిస్టర్స్ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంగనా సోదరి, ఆమె పర్సనల్ మేనేజర్ అయిన రంగోలీ సోషల్ మీడియాలో తన చెల్లెలు గురించి పబ్లిసిటీ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె కంగనాకి సంబంధించి ఓ పోస్ట్ పెట్టింది. అయితే దాన్ని కాస్త నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. కంగనా ఇటీవల ఎయిర్ పోర్ట్ లో చీర కట్టుకొని కనిపించింది. ఈ ఫోటో పోస్ట్ చేసిన రంగోలీ.. ఈ చీరను కంగనా కోల్‌కతాలో రూ.600 లకు కంగనా కొనుక్కుందని.. అంత తక్కువ మొత్తానికే ఇంత మంచి క్వాలిటీతో చీరలు దొరుకుతాయని తెలిసి తను ఆశ్చర్యపోయిందని.. అయితే ఈ చీరలను నేసేవారు అంత తక్కువ సంపాదన కోసం ఎంత శ్రమిస్తారో అర్ధమై తను చాలా బాధ పడిందని ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ ద్వారా కంగనా ఎంత సింపుల్ గా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసింది రంగోలీ. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఇప్పుడు కంగనాను రంగోలిని కలిపి ట్రోల్ చేస్తున్నారు. 'చీర సంగతి సరే.. ఆమె ధరించిన బ్యాగ్, చెప్పుల ధర, గ్లాసెస్ ధర చెప్పమని' ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'ఆమె ధరించిన చీర ఆరువందలే అయినా.. చెప్పులు, బ్యాగ్ లక్షల్లో ఉంటాయని' కామెంట్ చేశాడు. తక్కువ ధర చీర ధరించి చీప్ గా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారంటూ విమర్శిస్తున్నారు.