వరల్డ్ వైడ్ గా అత్యధిక అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటీనటుల్లో డ్వేన్ జాన్సన్ ఒకరు.రెజ్లింగ్ (WWE) ద్వారా అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకొని జనల చేత ముద్దుగా ది రాక్ అని పిపించుకున్నాడు. అయితే ఈ 47 ఏళ్ల స్టార్ సీక్రెట్ గా రెండో వివాహం చేసుకున్నాడు. స్కార్పియన్ కింగ్, ది మమ్మీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ , జూమాంజి వంటి సినిమాలతో ఈ హీరోకు క్రేజ్ వచ్చింది.

గత కొన్నాళ్లుగా జాన్సన్ లారెన్ హాషియాన్ అనే అమ్మాయితో ప్రేమను కొనసాగిస్తున్నాడు. గతంలోనే వీరి వివాహం జరిగినట్లు అనేక రకాల రూమర్స్ వచ్చాయి. పుకార్లు ఎన్ని వచ్చినా జాన్సన్ పట్టించుకోలేదు. 2007లోనే మొదటి భార్య డానీ గార్సియా నుంచి విడాకులు తీసుకున్నాడు. వీరికి 18 సంవత్సరాల కూతురు కూడా ఉంది.

అయితే ఇన్నాళ్లకు జాన్సన్  పెద్దగా హడావుడి లేకుండా హాషియాన్ ను హవాయ్ దీవుల్లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్యన జరిగిన ఈ పెళ్లి గురించి జాన్సన్ ఒకరోజు తరువాత సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశాడు.   

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

We do. August 18th, 2019. Hawaii. Pōmaikaʻi (blessed) @laurenhashianofficial❤️ @hhgarcia41📸

A post shared by therock (@therock) on Aug 19, 2019 at 3:27am PDT