ఈ రికార్డుల చరిత్ర.. చిరు నుంచే మొదలయ్యింది

First Published Aug 21, 2019, 11:07 AM IST

కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు.

కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని ఎవరూ చేరపలేరు. ఆయన నటించిన సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్సాఫీస్ వద్ద పండగే.. ఇక అభిమానుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నలభై ఏళ్ల సినీ కెరీర్ లో ఆయన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ కి పరిచయం లేని ఎన్నో రికార్డ్ లను పరిచయం చేశారు. అరవై ఏళ్లు దాటినా ఇప్పటికీ 'సై రా' లాంటి భారీ బడ్జెట్ చారిత్రాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలా తన పేరు మీద రిజిస్టర్ చేసుకున్న కొన్ని యూనిక్ రికార్డ్ ల వైపు ఓ లుక్కేద్దాం!

రూ.1.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరో చిరంజీవినే.. ఆయన నటించిన 'ఆపద్బాంధవుడు' సినిమాకి ఈ రేంజ్ లో పారితోషికం అందుకున్నారు. ఆ టైమ్ లో అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న యాక్టర్ అంటూ 'ది వీక్' అనే మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురించింది.

ఆస్కార్ అవార్డ్స్ కి సౌత్ ఇండియా నుండి ఇన్విటేషన్ అందుకున్న నటుల్లో చిరంజీవి తొలి వ్యక్తి. 'గెస్ట్ ఆఫ్ హానర్' గా 1987లో జరిగిన అకాడమీ అవార్డ్స్ కి ఆయన్ని ఆహ్వానించారు.

ఏడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి ఇండియన్ యాక్టర్ చిరంజీవి. 'ఇంద్ర' సినిమాకి ఇంత మొత్తం అందుకున్నారు. ఆ తరువాత ఆమీర్ ఖాన్ 'లగాన్' సినిమాకి ఆరు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు.

చిరంజీవి నటించిన 'ఘరానా మొగుడు' సినిమా బాక్సాఫీస్ వద్ద పది కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమా.

చిరంజీవి నటించిన 'ఇంద్ర' సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ముప్పై కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది.

ఎనిమిది ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న తొలి తెలుగు హీరో కూడా ఇతడే.. ఖైదీ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.

ఇంటర్నెట్ లో పెర్సనల్ వెబ్ సైట్ మొదలుపెట్టిన తొలి భారతీయ నటుడు చిరంజీవి.

బెస్ట్ యాకర్ గా ఏడు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న సౌత్ ఇండియన్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి.

ఏపీ, తెలంగాణాలో చిరంజీవి నటించిన 47 సినిమాలు వంద రోజులకు పైగా ఆడాయి.

ప్రస్తుతం చిరు నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా డబ్బింగ్ ని కేవలం ఇరవై గంటల్లో పూర్తి చేసిన ఘనత ఆయన సొంతం.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?