వరంగల్: టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విద్యార్థి అవతారం ఎత్తారు. వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్‌ఎల్‌ఎం కోర్సులో జాయిన్ అయిన జీవన్ రెడ్డి దూర విద్యను అభ్యసిస్తున్నారు. 

అయితే ఎల్ఎంఎల్ చివరి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్ష రాశారు. ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు రాసేందుకు జీవన్ రెడ్డి బుధవారం ఉదయమే వరంగల్ చేరుకున్నారు. కళాశాలలో జరిగిన గ్రూప్ డిస్కషన్లో పాల్గొని పరీక్షకు హాజరయ్యారు. 

ఇప్పటి వరకు జీవనర రెడ్డి అన్ని పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యారు. ఎల్ఎల్ఎం పూర్తి చేసి అనంతరం పీహెచ్ డీ కూడా చేస్తానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పీహెచ్ డీ ద్వారా న్యాయవిద్యలో పరిజ్ఞానం మరింత పెరుగుతుందన్నారు. 

వరంగల్ కాకతీయ యూనివర్శిటీలోకి ఎమ్మెల్యే జీవనర్ రెడ్డిరావడంతో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారని తెలియని వారంతా గుసగుసలు ఆడుకున్నారు. తీరా జీవన్ రెడ్డి పరీక్షలు రాయడం చూసి ఔరా అనుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కొందరు గుర్తుగా ఫోటోలు దిగారు కూడా.