నటి నిత్యామీనన్ టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ ఆరంభంలో కాస్త బొద్దుగా ఉండే ఈ భామ ఈ మధ్య కాలంలో బాగా లావైపోయింది. దీంతో ఆమె శరీరాకృతిపై సోషల్ మీడియాలో బాగా కామెంట్ చేస్తున్నారు. 

ఇటీవల ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తే వాటిపై కూడా ట్రోలింగ్ చేశారు. తాజాగా ఈ విషయాలపై స్పందించింది నిత్యా. ఆమె బాలీవుడ్ లో నటించిన 'మిషన్ మంగళ్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది నిత్యా.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసే ఫోటోలపై వచ్చే కామెంట్లు, నెటిజన్ల ట్రోలింగ్ గురించి మాట్లాడారు. ఎవరైనా లావుగా కనిపించారంటే.. తిని కూర్చోవడం వలన, బద్ధకం వలన లావైపోయుంటారని అనుకునేవారు చాలా మంది ఉన్నారని.. అది వారి అమాయకత్వమని చెప్పింది.

అలా తిని కూర్చోవడం వలన లావయ్యేవారు కూడా ఉంటారని కానీ నటుల విషయంలో అది ఎంతమాత్రం నిజం కాదని.. మాకు ఎలాంటి బద్ధకం ఉండదని చెప్పుకొచ్చింది. హార్మోన్ల ప్రభావం వలనో.. ఇతర సమస్యలకారణంగానో శరీర బరువు పెరుగుతుందే తప్ప తిని కూర్చొని పొట్ట పెంచుకోవడం లేదని.. ఇలాంటి విషయాల్లో ప్రజలకు అవగాహన  కల్పించాల్సిన అవసరం చాలా ఉందని.. తన శరీరాకృతిపై వచ్చే కామెంట్లు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుందని చెప్పుకొచ్చింది.