భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. మణుగూరు మండలం బుడుగుల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.  సంఘటనాస్థలంలో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మృతుడు గుంటూరు రవిగా పోలీసులు గుర్తించారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మావోయిస్టుల కూడా కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మావోయిస్టు పార్టీ విస్తరణ కోసం దళం గుత్తికోయ గ్రామాల్లో తిరుగుతోందని వెల్లడించారు.