బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'క్వీన్' సినిమాను సౌత్ నాలుగు భాషల్లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ 'క్వీన్' రీమేక్ ను 'పారిస్ పారిస్' అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.

అడల్ట్ రేటెడ్ సినిమాలో కూడా ఇలాంటి సీన్లు ఉండవనే కామెంట్స్ వినిపించాయి. అయితే ట్రైలర్ లో చూపించిన దానికంటే సినిమాలో చాలానే సీన్లు ఉన్నట్లు సెన్సార్ బోర్డ్ వద్ద తేలింది. దీంతో అసభ్య సంభాషణలు, సీన్లను మొత్తం కత్తిరించేసింది సెన్సార్ బోర్డు. ఈ విషయంలో నిర్మాతలు అభ్యంతరం తెలపడంతో ఆ కత్తిరింపులపై మరోసారి సమీక్ష జరుగుతోంది. 

క్వీన్ సౌత్ లోని అన్ని భాషల్లోనూ రీమేక్ అయింది. తెలుగు, మలయాళ, కన్నడ వెర్షన్ల విషయంలో రాని అభ్యంతరాలు కాజల్ నటించిన తమిళ వెర్షన్ విషయంలోనే వచ్చాయి. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతుండడంతో తనలోని హాట్ నెస్ ని ప్రదర్శించాలని కాజల్ అలాంటి సన్నివేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రస్తుతం సెన్సార్ వివాదం నడుస్తుండడంతో ఆమె స్పందించింది.

సినిమాలో సీన్లను కత్తిరించడం తనను అసంతృప్తికి గురి చేసిందని కాజల్ చెబుతోంది. అలా జరిగి ఉండాల్సింది కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఎంతో కష్టపడి సినిమా చేశామని.. ఒరిజినల్ లో ఉన్న సీన్లనే తీసినట్లుగా కాజల్ చెబుతోంది.