సినిమా ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ యూనిటీ గురించి తెలిసిందే. మెగా బ్రదర్స్, కజిన్స్ అందరూ కలిసే ఉంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటారు. అయితే అల్లు బ్రదర్స్ మాత్రం సెపరేట్ గా కనిపిస్తుంటారు. ఎంత మెగాఫ్యామిలీ మెంబర్స్ అయినప్పటికీ తమ ప్రత్యేకతను చాటడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా విడుదలైన 'సై రా' టీజర్ గురించి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడారు.

టీజర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మెగాఫ్యామిలీ సభ్యులు వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, నీహారిక, కళ్యాణ్ దేవ్, ఉపాసన ఇలా అందరూ తమ ట్విట్టర్ అకౌంట్లలో టీజర్ ని షేర్ చేస్తూ సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. కానీ అల్లు ఫ్యామిలీ నుండి ఒక్క ట్వీట్ కూడా కనిపించకపోవడం అభిమానులకు షాక్ ఇస్తోంది.

అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ, స్నేహా రెడ్డి వీరెవరూ కూడా సినిమా టీజర్ పై ఒక్క ట్వీట్ కానీ పోస్ట్ కానీ చేయలేదు. అల్లు అర్జున్ తప్పించి మిగిలిన వారంతా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అన్ని విషయాలపై స్పందించే వీరు చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన 'సై రా' సినిమా టీజర్ విడుదలైతే ఒక్క కామెంట్ కూడా చేయలేదు.

పోనీ వారంతా బిజీగా ఉండి స్పందించలేదని అనుకుందాం.. అలా అయితే వరుణ్ తేజ్ ప్రస్తుతం హాలిడేలో ఉన్నాడు. ధరం తేజ్ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఉపాసన తన బిజినెస్ పని మీద గ్రీస్ వెళ్లింది. వీరంతా ఎంత బిజీగా ఉన్నా.. చిరు మీద ప్రేమతో ఒక ట్వీట్ పెట్టడానికి టైమ్ ఇచ్చుకున్నారు. కానీ అల్లు బ్రదర్స్ ఆ విధంగా చేయకపోవడంతో అభిమానులు హర్ట్ అవుతున్నారు.