ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్.ఆర్. ఆర్'. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్ నటిస్తుందని ప్రకటించిన జక్కన... ఎన్.టీ.ఆర్ సరసన హాలీవుడ్ స్టార్ డైసీ ఎడ్గర్ జోన్స్‌ నటిస్తున్నట్టు ప్రకటించాడు.  అయితే లాస్ట్ మినిట్ లో డైసీ ఎడ్గర్ జోన్స్ పర్శనల్ కారణాలతో ఈ ప్రాజెక్టుకు హ్యాండ్ ఇచ్చేసింది. 

అప్పటి నుంచి మరో బ్రిటన్ నటి కోసం వేట సాగుతోంది. అయితే రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికి ఇన్నాళ్లూ ఎవరూ సెట్ కాలేదు. కానీ అందుతున్న సమాచారం మేరకు..మరో బ్రిటన్ నటిని ఎన్టీఆర్ సరసన ఫైనలైజ్ చేసారు. పేరు ఇంకా బయిటకు రాలేదు కానీ రీసెంట్ గానే ఈ  ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది. బ్రిటన్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి ఆమె అని, ఇప్పుడు ‘RRR’ సినిమా ద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతోంది అని తెలుస్తోంది.  అక్టోబర్ నుంచి ఆమె షూట్ లో పాల్గొననుంది. 

రాజమౌళి తన టీమ్ కు ఎక్కడా కూడా ఈ సినిమాలో చేస్తున్నట్లు చెప్పవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. అఫీషియల్ గా ఫస్ట్ లుక్ వదిలేదాకా ఆమె ఎవరో తెలియకూడదని , పెద్ద బ్యాంగ్ లా ఆమె ని ప్రకటిద్దామని, అప్పటిదాకా ఆ సస్పెన్స్ ని అలాగే కొనసాగిద్దామని ఫిక్స్ అయ్యినట్లు సమాచారం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి సెంథిల్ ఛాయాగ్రాహకుడు. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని డీవీవీ క్రియేషన్స్ పై దానయ్య నిర్మిస్తున్నారు.