ఎందరు కుర్ర యాంకర్లు వచ్చినా సీనియర్ యాంకర్ సుమకు ఉండే క్రేజే వేరు. బుల్లితెరపై, ప్రీరిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్ ఎక్కడా చూసిన సుమ పలుకులే వినిపిస్తుంటాయి. స్పాంటేనియస్ యాంకర్ గా సుమకు మంచి గుర్తింపు ఉంది. బుల్లి తెరపై మహిళలకు నచ్చే ప్రోగ్రాం వస్తోందంటే అందులో యాంకర్ సుమ అని చెప్పడంలో సందేహం లేదు. 

ఇదిలా ఉండగా సుమ చేసిన ఓ షార్ట్ ఫిలిం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ షార్ట్ ఫిలిం పేరు 'ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు'. ఈ షార్ట్ ఫిలిం లో సుమపై వేసే సెటైర్లు, అందుకు ఆమె ఇచ్చే రియాక్షన్స్ ఫన్నీగా ఉన్నాయి. డబ్బులేక భాదపడుతున్న ఇద్దరు సుమని కిడ్నాప్ చేస్తారు. 

స్పృహలో లేకుండా ఉన్న సుమని ఓ డెన్ లో బంధిస్తారు. కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తి సుమక్క.. సుమక్క అంటూ ఆమెని మేల్కొలిపే ప్రయత్నం చేస్తాడు. ఆమెని లేపే విధానం అదికాదు.. నేను మేల్కొలుపుతా చూడు.. అని మరో కిడ్నాపర్ మొదలు పెడుతాడు. సుమక్క అదిగో ఆడియో ఫంక్షన్, అదిగో ప్రీ రిలీజ్ ఈవెంట్, జెఆర్సి లో మరో ఈవెంట్ జరుగుతోంది అని అంటాడు. వెంటనే సుమ మేల్కొంటుంది. ప్రొడ్యూసర్ ఎవరు, బ్యానర్ ఏంటి, డబ్బులొచ్చే బేరమేనా అని కంగారుగా అడుగుతుంది. 

నిన్ను మేము కిడ్నాప్ చేశాం అని చెప్పగానే నా వల్ల ఎన్ని షోలు ఆగిపోతాయి.. నాకు ఎంత నష్టం అని అడుగుతుంది. చాలా ఫన్నీగా సాగే ఈ షార్ట్ ఫిలిం ప్రస్తుతం నెటిజన్లందరిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సుమ యాంకరింగ్ గురించి కిడ్నాపర్లు వేసే సైటైర్లు ఫన్నీగా ఉన్నాయి.