గత కొద్ది రోజులుగా మీడియాలో ఇదే వార్త నానుతోంది. తెలుగు టీవి ఛానెల్స్ ఈ విషయాన్ని పెద్దది చూసి బూతద్దంలో చూపించి ఫ్యాన్స్ ని బెదరకొట్టేస్తున్నాయి. అయితే ఈ వార్త నిజమేనా...చాలా కూల్ గా ఉండే నాగార్జున తనకు ఇష్టమైన కోడలు సమంత విషయంలో అలా ఎందుకు కోపం గా ఉంటారనేది హాట్ టాపిక్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో మారింది. వెబ్ సైట్స్, మీడియా ఛానెల్స్ చెప్పేదేమిటంటే...మన్మధుడు 2 విషయంలో సమంత సైలెంట్ గా ఉండిపోయిందని, అదే నాగ్ కు కోపం తెచ్చిందని. మన్మధుడు 2 రిలీజ్ కు ముందు నుంచి సమంత వ్యూహాత్మకంగా మౌనంగా ఉంది.

ఆ సినిమాలో ఆమె నటించినా ..ఆమెకు అసలు నచ్చలేందంటున్నారు. నాగ్ అలా అమ్మాయిల కోసం వెంపర్లాడే ప్లే బోయ్ పాత్రను ఆమె డైజస్ట్ చేసుకోలేకపోయిందని చెప్తున్నారు. అందుకే ఆమె ఎక్కడా ప్రమోషన్స్ లో కనపడలేదని, అలాగే ట్విట్టర్, ఇనిస్ట్రగ్రమ్ లో పోస్ట్ లు కూడా పెట్టలేదని అంటున్నారు. అయితే తన పాత్ర చిన్నది కావటంతో తను కనుక ఆ సినిమా గురించి ఎక్కువ మాట్లాడితే...ఎక్సపెక్టేషన్స్ పెరుగుతాయని అలా చేసిందని ఓ వర్గం అంటోంది. అదీ నిజమే అయ్యిండవచ్చు.

అయితే నాగార్జున తదుపరి చిత్రం బంగార్రాజు విషయంలోనూ అలాంటి సమస్యే వచ్చిందిట. బంగార్రాజు పాత్ర సైతం మన్మధుడు 2లో నాగ్ క్యారక్టర్ టైప్ అంటున్నారు. సోగ్గాడే చిన్ని నాయినా చిత్రానికి ప్రీక్వెల్ గా రెడీ అవుతున్న ఈ చిత్రం స్క్రిప్టు చదివిన సమంత మౌనంగా ఉండిపోయిందిట. దానికి తోడు నాగచైతన్య ఆ సినిమాలో క్యారక్టర్ చేస్తూండటంతో ..వాటికి కరెక్షన్స్ చెప్పిందిట. వాటిని చేస్తే కానీ ఓకే చేయనని చైతూ ఆ డైరక్టర్ కు చెప్పాడట. దాంతో ప్రాజెక్టు పట్టాలు ఎక్కటం లేదని, నాగ్ విసుక్కుంటున్నారట. ఇలా రకరకాల రూమర్స్ ఈ మామా,..కోడళ్లు ఇద్దరి మధ్యా తగువు ఉందంటూ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏది నిజమో..ఏది అబద్దమో ఎవరికీ తెలియదు.