హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాజధాని  మార్పు  విషయమై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

బుధవారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ అంశం కేంద్రం పరిధిలోకి రాదన్నారు. హైద్రాబాద్‌ను దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తల్లో కూడ వాస్తవం లేదన్నారు.

హైద్రాబాద్ సనత్ నగర్ లో ఈఎస్ఐ లో రూ. 150 కోట్లతో కొత్త బ్లాక్ నిర్మాణానికి ఆయన బుధవారం నాడు స్పందించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఆరోగ్యశ్రీ కార్యక్రమం అంత గొప్ప కార్యక్రమమైతే ప్రజలు ఎందుకు ధర్నాలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

జేపీ నడ్డా ఎవరో తెలియదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పబుట్టారు. నిజామాబాద్ ఎంపీ స్థానంలో కవిత ఎందుకు ఓటమి పాలైందని  ఆయన ప్రశ్నించారు

బీజేపీ లేకపోతే రాష్ట్రంలో  నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ ఎలా విజయం సాధించిందని ఆయన ప్రశ్నించారు.2023లో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు.

సంబంధిత వార్తలు

కర్నూల్‌నురాజధాని చేయాలి: వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే