అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల
అసెంబ్లీ తనకు దేవాలయం వంటిదన్నారు ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, స్పీకర్‌గా ఉన్నన్ని రోజులు అసెంబ్లీలో పూజారిలా పనిచేశానని... వైసీపీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని కోడెల ఎద్దేవా చేశారు
అసెంబ్లీ తనకు దేవాలయం వంటిదన్నారు ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. శాసనసభ ఫర్నిచర్ వ్యవహారంపై ఆయన బుధవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు.
అధికారాన్ని అభివృద్ధికి, రాష్ట్రం కోసం ఉపయోగించాలని... బురద జల్లడానికి, కక్షసాధించేందుకు ఉపయోగించవద్దని ఆయన హితవు పలికారు. తన పిల్లలపై కేసులు పెట్టారని.. గుంటూరులో మా హీరో హోండా షోరూం మూసివేయించారని తెలిపారు.
స్పీకర్‌గా ఉన్నన్ని రోజులు అసెంబ్లీలో పూజారిలా పనిచేశానని... వైసీపీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని కోడెల ఎద్దేవా చేశారు. తెలుగు ప్రజల కల లాంటి అమరావతి నగరం ఇప్పుడు స్మశానంలా కనిపిస్తుందన్నారు.
ప్రభుత్వాధినేతలు ఏం చేసినా ఆలోచించి చేయాలని ఆయన కోరారు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంపై నిన్నే వివరణ ఇచ్చానని కోడెల స్పష్టం చేశారు.
ప్రభుత్వం మారిన వెంటనే అసెంబ్లీ అధికారులకు లేఖ రాశానని.. ఫర్నీచర్ తీసుకెళ్లండి..లేదంటే డబ్బులు తీసుకెళ్లండని చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. కొత్త అసెంబ్లీకి ఫర్నీచర్‌ను సీఆర్‌డీయేనే సమకూర్చిందన్నారు.
అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల
అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?