చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

By narsimha lodeFirst Published Aug 21, 2019, 5:08 PM IST
Highlights

మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి చుక్కెదురైంది. బుధవారం నాడు ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించలేదు. శుక్రవారం నాడు ఈ పిటిషన్ పై విచారణ చేయనుంది.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ కేంద్ర మంత్రి చిదంబరం మంగళవారంనాడు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.  చిదంబరం  దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను శుక్రవారం నాడు సుప్రీంకోర్టు విచారించనుంది.

ఐఎఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి చుక్కెదురైంది.ఇవాళే ఈ కేసు విచారించాలని సుప్రీంకోర్టులో చిదంబరం తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును ఆశ్రయించారు. ఉదయం , మధ్యాహ్నం పూట ఈ కేసు విచారణను చేపట్టాలని సుప్రీంకోర్టులో కోరారు. అయితే   ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ చేసే విషయాన్ని సుప్రీంకోర్టు సీజేఐ నిర్ణయం తీసుకొంటారని జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు.

అయోధ్య కేసు రోజు విచారిస్తున్నందున సుప్రీంకోర్టు  చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ బిజీగా ఉన్నారు. సాయంత్రం వరకు కూడ ఈ కేసు విషయమై బిజీగా ఉన్నారు.ఈ కేసు విచారణ చేయాలని కపిల్ సిబల్ కోరారు.అయితే కపిల్ సిబల్ వినతి మేరకు ఈ కేసును శుక్రవారం నాడు విచారించనున్నట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది.

ఐఎన్ఎక్స్ కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నాడు నిరాకరించింది. దీంతో నిన్నటి నుండి మాజీ కేంద్ర మంత్రి అజ్ఞాతంలో ఉన్నారు.

 

 

సంబంధిత వార్తలు

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ

click me!