సినీ నటుడు రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కారుని కంట్రోల్ చేయలేక డివైడర్ ని ఢీకొట్టడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో రాజ్ తరుణ్ కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో బ్రతికి బయటపడ్డాడు. 

వెంటనే కారు నుండి దిగి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఈ ఘటన గురించి రాజ్ తరుణ్ ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చాడు. నార్సింగ్ సర్కిల్ ప్రాంతంలో హఠాత్తుగా కుడివైపునకు తిరగాల్సి రావడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గోడకు ఢీకొట్టిందని, షాక్ తో వెంటనే ఇంటికి వెళ్లిపోయాయని వెల్లడించాడు.

ఈ క్రమంలో కాసేపు నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చాడు. ముందుగా ఓ నెటిజన్ 'తాగి కారు నడపడం వలనే యాక్సిడెంట్ అయిందా..?' అని ప్రశ్నించగా.. దానికి స్పందించిన రాజ్ తరుణ్ 'అదేం ప్రశ్న భయ్యా.. నేను తాగలేదు' అని బదులిచ్చాడు.

ఇది చూసిన మరో నెటిజన్ 'తాగితే మాత్రం చెప్తారా ఏంటి..?' అని అడగగా.. అది చూసిన రాజ్ తరుణ్ 'యాక్సిడెంట్ అయి బయట పడితే.. గోరు చుట్టు మీద రోకలి పోటు ఏంటి భయ్యా' అని బాధాకరమైన ఎమోజీలు పెట్టాడు.

ఇక తన సినిమాలు, వ్యక్తిగత జీవితం ఇలా చాలా విషయాలపై స్పందించాడు. మరో రెండు, మూడేళ్ల తరువాత పెళ్లి చేసుకుంటానని ప్రస్తుతానికి ఎవరితో ప్రేమలో లేనని చెప్పాడు. ప్రస్తుతం ఈ హీరో 'ఇద్దరి లోకం ఒకటే' అనే సినిమాలో నటిస్తున్నాడు.  

రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

కారు వదిలేసి పారిపోయిన రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?

రాజ్ తరుణ్ పారిపోవడంపై పోలీసుల అనుమానాలు ఇవే!

యాక్సిడెంట్ ఘటనపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్