డియర్ కామ్రేడ్ రివ్యూ: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 26, 2019, 5:51 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

‘డియర్ కామ్రేడ్’ రివ్యూ!

టైటిల్ లో కమ్యూనిజం, పోస్టర్స్ లో  రొమాంటిజం , ట్రైలర్ లో పోరాట నేపధ్యం...ఇలా విభిన్న ఎలిమెంట్స్ ని పరిచయం చేస్తూ మన ముందుకు వచ్చిన చిత్రం‘డియర్ కామ్రేడ్’.

 

14 మందికే బాకీ, ధర్నా చేసేవాళ్లు మా ఉద్యోగులు కాదు: కేశినేని నాని

తాను ఎవరికి రూపాయి కూడా బకాయి కూడా బాకీ పడలేదన్నారు. గుంటూరు లేబర్ కోర్టులో 14 మంది కేసులు వేశారని.. వాళ్లకి మాత్రమే ఇవ్వాల్సి ఉందని, రాజీకి వచ్చి కేసు విత్ డ్రా చేసుకుంటే ఈ నిమిషంలోనే వారి బకాయిలను మాఫీ చేస్తానని కేశినేని స్పష్టం చేశారు.

 

ఖబడ్డార్, జాగ్రత్తగా ఉండండి : వైసీపీకి చంద్రబాబు వార్నింగ్

 రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అత్యంత దారుణంగా వైసీపీ నేతలు హత్య చేశారని ఆరోపించారు. మరికొన్ని ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు చంద్రబాబు. 

 

 

రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌కు అనుమతి నిరాకరణ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శితో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ ఆవరణలో ప్రెస్ మీట్  పెట్టుకోవడానికి అసెంబ్లీ కార్యదర్శి అనమతించలేదు. దీంతో రేవంత్ రెడ్డి ఆయనతో  వాగ్వాదం చోటు చేసుకొంది.

 

జ్యూడీషియల్ కమిషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమెదం: ప్రతీ టెండర్ ప్రజల ముందుకేనన్న సీఎం జగన్

రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు సంబంధించిన టెండర్ ను మెుదట ప్రజల ఎదుట పెడతామని జగన్ తెలిపారు. వారం రోజుల తర్వాత టెండర్ వివరాలు జడ్జ్ ముందుకు వెళ్తాయి అని చెప్పుకొచ్చారు. జడ్జి సిఫారసులు సంబంధిత శాఖ పాటించేలా నిబంధనలు తీసుకురాబోతున్నట్లు చెప్పుకొచ్చారు. మెుత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదన ఖరారవుతుందని జగన్ స్పష్టం చేశారు.  

 

ధోని స్థానంలో ఆడుతున్నా....కాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకోవాల్సిందే: రిషబ్ పంత్

మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా లెజెండరీ  ప్లేయర్. అయితే అతడు ఇటీవల విండీస్ పర్యటనుకు దూరమవడంతో ఈ స్థానంలో రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ధోని  స్థానంలో ఆడే అవకాశం రావడంపై పంత్ స్పందించాడు.  

 

'జెర్సీ' నిజంగానే హిట్టా.. నాని ఎందుకు ఒప్పుకున్నాడు.. పరుచూరి!

ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ యూట్యూబ్ వేదికగా కొత్తగా విడుదలైన చిత్రాల గురించి తన అభిప్రాయం చెబుతున్నారు. తాజాగా పరుచూరి.. నాని నటించిన జెర్సీ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. ఇటీవలే జెర్సీ చిత్రాన్ని చూశానని.. ఇంతటి అద్భుతమైన చిత్రంలో నటించినందుకు నానికి ముందుగా ధన్యవాదాలు చెబుతున్నట్లు పరుచూరి అన్నారు. 

 

గాంధీ ఆస్పత్రిలో వైద్యుల టిక్ టాక్.. సస్పెన్షన్

ఒకవైపు రోగులు వైద్యం అందక ఇబ్బంది పడుతుంటే... జూనియర్ వైద్యులు  టిక్ టాక్ చేస్తూ కాలక్షేపం చేయడం గమనార్హం. గాంధీ ఆస్పత్రిలోని ఫిజయో థెరపీ విభాగంలోని జూనియర్ వైద్యులు చేసిన టిక్ టాక్ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 

 

ఇద్దరు పిల్లలు, భర్త దుబాయ్‌లో : నర్స్‌ను లోబరుచుకున్న వైద్యుడు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ నర్స్‌పై డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీ అల్‌జుబైల్ కాలనీకి చెందిన ఓ మహిళకు పెళ్లయి పిల్లలున్నారు.

 

ఓటేయ్యరని భయంతో వాటిని నేనే నొక్కేసా: అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

మార్కెట్ యార్డులను బతికించాలని, పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను గౌరవ చైర్మన్లుగా నియమించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం మార్కెట్ యార్డుకు ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేయలేదని అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా వాటిని విడుదల చేశామని చెప్పుకొచ్చారు. 

 

రైతును రాజును చేయడమే మా లక్ష్యం, అందుకే ఆ నిర్ణయం: సీఎం వైయస్ జగన్

మార్కెట్ బిల్లు 2019 బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రసంగించిన సీఎం జగన్ రైతులకు గిట్టుబాటు ధర ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకే ఎమ్మెల్యేలను మార్కెటింగ్ కమిటీలకు గౌరవ చైర్మన్లుగా నియమించినట్లు స్పష్టం చేశారు. 

 

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు: జగన్ సర్కార్ పై దగ్గుబాటి పురంధేశ్వరి ఫైర్

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతుందని విమర్శించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు తరహాలోనే జగన్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె విమర్శించారు. గోదావరి జలాల పంపకం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయంగా చూడటం సరైంది కాదని హితవు పలికారు. 
 

 

ఏపీ అసెంబ్లీ నుంచి మళ్లీ టీడీపీ వాకౌట్

వైసీపీ మాట్లాడుతున్నంతసేపు తమకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పట్టుబట్టారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీ శాసన సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. తమ అధినేతకు మైక్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 

 

కృష్ణమ్మను బంధించిన కేసీఆర్ తో స్నేహమా...జగన్!ఆయన మాయలో పడొద్దు

కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ ప్రభుత్వ పెత్తనం ఏంటని నిలదీశారు. ఇప్పటికే కృష్ణమ్మను బంధించిన కేసీఆర్ గోదావరిని కూడా బంధించాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ మాయలో పడొద్దని హితవు పలికారు. 

 

నీ బాస్‌లా సంకనాకిపోతావ్: కేశినేనిపై పీవీపీ ట్వీట్

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నాని.. వైసీపీ నేత పీవీపీల మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ జనం దృష్టిని ఆకర్షిస్తున్నారు.

 

బీజేపీ ఎదగాలంటే టీడీపీ చితికిపోవాలి, తిట్టకతప్పదు: సోము వీర్రాజు

తెలుగుదేశం పార్టీపై కారాలు, మిరియాలు నూరే ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో టీడీపీ చితికిపోతేనే  బీజేపీ ఎదుగుతుందని వ్యాఖ్యానించారు.

 

చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు కూడా: మందకృష్ణ

అమరావతి:  ప్రతిపక్ష నేతగా మూడువేల కి.మీ పాదయాత్ర చేసిన జగన్  సీఎం అయిన తర్వాత తమకు  36 కి.మీ పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృస్ణ మాదిగ విమర్శించారు.

 

బీజేపీలో చేరింది అందుకే: తేల్చి చెప్పిన అఖిలప్రియ సోదరుడు

ప్రధాని మోడీ సమర్థ పాలన.. బీజేపీ భావాలు నచ్చే తాను భారతీయ జనతా పార్టీలో చేరినట్లు ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా కిశోర్ రెడ్డి. బీజేపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు టీడీపీలో ఎలాంటి సభ్యత్వం లేదని స్పష్టం చేశారు.

 

ప్రేమ విఫలం..చనిపోతున్నానని మెసేజ్ పెట్టి యువకుడి ఆత్మహత్య

ప్రేమలో ఫెయిల్ అయ్యాననే బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

 

టీడీపీ హామీలతో మాకేంటి సంబంధం... మంత్రి కన్నబాబు

అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం మొదలయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గత టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి తమను  ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఆయన ఈ విధంగా స్పందించారు.

 

వృద్ధుడి కోరిక తీర్చడానికి... బాలికకు డబ్బులతో ఎరవేసి..

మైనర్ బాలికను వ్యభిచారంలోకి దించేందుకు ఇద్దరు మహిళలు చేసిన ప్రయత్నాన్ని బంజారాహిల్స్ పోలీసులు భగ్నం చేశారు. తన భర్త కోరిక తీర్చాలని ఓ మహిళ బాలికను వేధించడం గమనార్హం.

 

టార్గెట్ కేసీఆర్‌‌: బీజేపీ అస్త్రమిదే

తెలంగాణలో రాజకీయంగా బలోపేతం కావడానికి బీజేపీ అన్ని రకాల అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తోంది. టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకొని విస్తృతంగా ప్రచారం చేయనుంది.

 

విజయ్ దివస్: లేఖ రాసినా యుపిఎ ప్రభుత్వం పట్టించుకోలేదన్న రాజీవ్ చంద్రశేఖర్

కార్గిల్‌ యుద్ధంలో విజయానికి గుర్తుగా విజయ్ దివస్‌ను నేడు జరుపుకుంటున్నామని.. కానీ 2004-09 మధ్య కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం విజయ్ దివస్‌ను పట్టించుకోలేదన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు రాజీవ్ చంద్రశేఖర్. విజయ్ దివస్ సందర్భంగా ఆయన కార్గిల్ అమర వీరులకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. 

 

ఆవులు- ఆక్సిజన్‌పై ఉత్తరాఖండ్ సీఎం వింత వాదన... నెటిజన్ల ఫైర్

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మానవ పరిణామ క్రమంలో ఒక కొత్త అర్ధాన్ని ఇచ్చారు. సాధారణంగా ఈ భూగోళం మీద జీవించే అన్ని ప్రాణులు ఆక్సిజన్‌ను పీల్చి.. కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయి.. కానీ ఈ ప్రపంచంలో ఆవు ఒక్కటే... ఆక్సిజన్‌ను పీల్చి.. ఆక్సిజన్‌నే విడుదల చేస్తుందని త్రివేంద్ర సింగ్ వింత వాదనను లేవనెత్తారు.

 

కర్ణాటకలో మధ్యంతరం తథ్యం: సిద్దరామయ్య

బెంగుళూరు:  కర్ణాటక అసెంబ్లీ బీజేపీకి ప్రయోగాలు చేసేందుకు ల్యాబ్ గా మారిందని మాజీ ముఖ్యమంత్రి కర్ణాటకలో కాంగ్రెస్ పక్ష నేత సిద్దరామయ్య విమర్శించారు.

 

ఒక్క అమ్మాయి కూడా నాకు ప్రపోజ్ చేయలేదు.. కారణం అదే.. సల్మాన్ ఖాన్!

కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుత వయసు 53. అయినా సల్మాన్ పెళ్లి గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. సల్మాన్ ఖాన్ ప్రేమ వ్యవహారాలు, డేటింగ్స్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. మీడియా పెళ్లి గురించి ప్రశ్నించినప్పుడల్లా సల్మాన్ ఖాన్ తప్పించుకోవడమో లేకుంటే ఓ జోక్ వేసి వెళ్లిపోవడమో చేస్తూ వచ్చాడు. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ తన పెళ్లి గురించి ప్రస్తావించాడు. 

 

కరణ్ జోహార్ సినిమా చేద్దామన్నారు.. గర్వంగా ఫీల్ అయ్యా: విజయ్ దేవరకొండ

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహర్‌ డియర్‌ కామ్రేడ్‌ సినిమాను చూసి మెచ్చుకున్నారని ఆ చిత్ర హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆయన సినిమా చూసిన విధానం నచ్చిందని, నాతో పాటు హీరోయిన్, దర్శకుడు, ఇతర నటీనటులను అభినందిస్తూ.. తనతో సినిమా చేయాలని కోరారని చెప్పారు. ఆయన అలా అడగడంతో చాలా గర్వంగా ఫీలయ్యానని తెలిపారు.
 

 

'డియర్ కామ్రేడ్' ప్రీమియర్ కలెక్షన్స్.. రాంచరణ్ ని దాటేసిన విజయ్!

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోసారి విజయ్ దేవరకొండ ఎమోషనల్ లవ్ స్టోరీతో మెప్పించినట్లు తెలుస్తోంది. ఆడియన్స్ నుంచి డియర్ కామ్రేడ్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించాడు. 

 

కమెడియన్ సునీల్ పై హీరో ఆకాష్ షాకింగ్ కామెంట్స్!

ఆకాష్ హీరోగా నటించిన 'పిలిస్తే పలుకుతా' సినిమాలో సునీల్ కమెడియన్ పాత్ర పోషించాడు. ఆ పరిచయంతో సునీల్ కి హీరోగా 'అందాల రాముడు' ఛాన్స్ వచ్చిన సమయంలో ఆకాష్ కి ఫోన్ చేసి 'భయ్యా నేనో సినిమా చేస్తున్నా.. మీరు అందులో ఒక క్యామియో  చేయాలని' రిక్వెస్ట్ చేశాడట. 

 

RRR: దానయ్యతో ఆ కంపెనీ మెగా డీల్.. అప్పుడే అడ్వాన్స్ చేతికి!

బాహుబలి తర్వాత రాజమౌళి తెరక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఇది. స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. 

 

ఒక్క పోస్ట్ కి రూ.2 కోట్లా.. ప్రియాంక డిమాండ్ మాములుగా లేదు!

చిన్న సెలబ్రిటీ అయినా.. బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. అలాంటిది మిలియన్ల ఫాలోవర్లు ఉండే స్టార్ సెలబ్రిటీల డిమాండ్ ఎలా ఉంటుందో 
 

 

వైరల్: కెమెరామెన్ తో ప్రియా ప్రకాష్ ముద్దు వీడియో!

కన్నుగీటు వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె నటించిన మొదటి సినిమా 'ఒరు అడార్ లవ్'కి కేవలం ప్రియా ప్రకాష్ కారణంగా మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాను 'లవర్స్ డే' పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు. కానీ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ప్రియా క్రేజ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆమెకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 

బుమ్రా ఊసెత్తగానే మొహం మాడ్చేసిన అనుపమ!

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కి, క్రికెటర్ బుమ్రాకి మధ్య ఎఫైర్ నడుస్తుందని చాలా రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్ని మీడియా పత్రికలు, వెబ్ సైట్ లు కూడా ఆ విషయాన్ని  కథనాలుగా ప్రచురించారు.

 

బిగ్ బాస్ హౌస్ లోకి పోలీసులు.. నటి అరెస్ట్ తప్పదా..?

తమిళంలో బిగ్ బాస్ మూడో సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ హౌస్ లోకి ఒకసారి పోలీసులు ప్రవేశించారు. సీజన్ 3లో కంటెస్టంట్ గా పాల్గొన్న నటి వనితా విజయ్ కుమార్ తన కూతురిని కిడ్నాప్ చేసిందన్న ఆరోపణతో హైదరాబాద్ పోలీసులు, చెన్నై పోలీసులు విచారణలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు. ఆ సమయంలో వనితని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది.

 

రూ.40 కోట్ల రెమ్యునరేషనా..? షాక్ ఇస్తోన్న షాహిద్ కపూర్!

కొంతకాలంగా బాలీవుడ్ లో సరైన సక్సెస్ లేక డీలా పడ్డ షాహిద్ కపూర్ ఒక్కసారిగా 'కబీర్ సింగ్'తో బంపర్ హిట్ కొట్టాడు. తెలుగులో వచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్నే బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో హీరోగా నటించిన షాహిద్ కి మంచి క్రేజ్ వచ్చింది. 

 

 

click me!