కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుత వయసు 53. అయినా సల్మాన్ పెళ్లి గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. సల్మాన్ ఖాన్ ప్రేమ వ్యవహారాలు, డేటింగ్స్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. మీడియా పెళ్లి గురించి ప్రశ్నించినప్పుడల్లా సల్మాన్ ఖాన్ తప్పించుకోవడమో లేకుంటే ఓ జోక్ వేసి వెళ్లిపోవడమో చేస్తూ వచ్చాడు. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ తన పెళ్లి గురించి ప్రస్తావించాడు. 

సల్మాన్ ఖాన్ కి ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా ప్రపోజ్ చేయలేదట. ఈ విషయం గురించి సల్మాన్ ఖాన్ సరదాగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. నేను నటించిన సినిమాల్లో ప్రేమించమని, పెళ్లి చేసుకోమని అడిగిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ రియల్ లైఫ్ లో ఒక్క అమ్మాయి కూడా నాకు ఇంతవరకు ప్రపోజ్ చేయలేదు. 

అమ్మాయిలు నాకు ప్రపోజ్ చేయకపోవడానికి కారణం ఉంది. నేను ఎవర్నీ ఇంతవరకు క్యాండిల్ లైట్ డిన్నర్ కు తీసుకెళ్లలేదు. సరిగా కనిపించని ఆ వెలుతురులో తినాలంటే నాకు ఇబ్బంది అని సల్మాన్ ఖాన్ సరదాగా తెలిపాడు. నాకు ఒక్క అమ్మాయి కూడా ప్రపోజ్ చేయలేదని అప్పుడప్పుడూ భాదపడుతుంటా అని సల్మాన్ ఖాన్ తెలిపాడు. 

సల్మాన్ ఖాన్ ఇలా జోకులేస్తున్నాడు కానీ.. అతడి ప్రేమ వ్యవహారాల గురించి తెలియనిది ఎవరికి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రొమేనియాకు చెందిన ఇలియా వంటూర్ తో డేటింగ్ లో ఉన్నట్లు చాలా రోజులు వార్తలు వస్తున్నాయి.