తెలుగుదేశం పార్టీపై కారాలు, మిరియాలు నూరే ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో టీడీపీ చితికిపోతేనే  బీజేపీ ఎదుగుతుందని వ్యాఖ్యానించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై రామ్ మాధవ్ వ్యాఖ్యలను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని వీర్రాజు స్పష్టం చేశారు. రామ్ మాధవ్, కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు అంశాల ఆధారంగా చేసినవేనని తెలిపారు.

తాము ఎదగాలంటే ఎవరినైనా తిట్టాల్సిందేనని సోము స్పష్టం చేశారు. బీజేపీలో ఇప్పుడ ఏ గ్రూపులు లేవని.. ఉన్నది ఒకటే గ్రూప్ అని సోము వీర్రాజు వెల్లడించారు.