మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కి, క్రికెటర్ బుమ్రాకి మధ్య ఎఫైర్ నడుస్తుందని చాలా రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్ని మీడియా పత్రికలు, వెబ్ సైట్ లు కూడా ఆ విషయాన్ని  కథనాలుగా ప్రచురించారు.

సోషల్ మీడియాలో అనుపమను బుమ్రా ఫాలో అవ్వడంతో పాటు ఆ మధ్య హోటల్ లో వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా బయటకి రావడంతో జనాలు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని గతంలో అనుపమ తెలిపింది. అయినప్పటికీ ఆమెకి బుమ్రాకి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

తాజాగా 'రాక్షసుడు' సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకొచ్చిన అనుపమ వద్ద బుమ్రా వ్యవహారాన్ని ప్రస్తావించారు. దీంతో ఆమె కాస్త అసహనంగా మొహం పెట్టింది. నో కామెంట్ అని మాత్రమే స్పందించింది. మీడియా ప్రతినిధులు మాత్రం తగ్గకుండా ఆమె నుండి సమాధానం రాబట్టాలని చూశారు. గతంలో బుమ్రాను కేవలం స్నేహితుడని మాత్రమే అన్నారని, ఇప్పుడు కూడా స్నేహితుడేనా లేక అంతకంటే ఎక్కువా..? అని ప్రశ్నించారు. 

ఈ ప్రశ్నకు కూడా అనుపమ సైలెంట్ గా ఉండిపోయింది. ఏదొకటి రియాక్ట్ అవ్వాలని మీడియా కోరితే.. నో కామెంట్ అని నవ్వుతూ బదులిచ్చింది. కానీ బుమ్రా పేరెత్తిన సమయంలో అనుపమ ముఖకవళికలు మారిపోయాయి. ఆమెకి బుమ్రాతోకనెక్షన్ కట్ అయిందని కొత్త పుకార్లు మొదలయ్యాయి. అది నిజమేనని అనుపమ క్లోజ్ సర్కిల్ అంటోంది.