కొంతకాలంగా బాలీవుడ్ లో సరైన సక్సెస్ లేక డీలా పడ్డ షాహిద్ కపూర్ ఒక్కసారిగా 'కబీర్ సింగ్'తో బంపర్ హిట్ కొట్టాడు. తెలుగులో వచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్నే బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో హీరోగా నటించిన షాహిద్ కి మంచి క్రేజ్ వచ్చింది. 

ఒక్కసారి అతడి దశ తిరిగిపోయింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో తన  తదుపరి సినిమా కోసం నలభై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అడుగుతున్నాడట షాహిద్. దానికి నిర్మాతలు కూడా ఓకే చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ మీడియా వర్గాల కథనం ప్రకారం.. తెలుగులో సక్సెస్ అయిన 'జెర్సీ' సినిమా హిందీలో రీమేక్ కాబోతుంది.

అందులో కూడా షాహిద్ హీరోగా నటించబోతున్నాడు. కరణ్ జోహార్ ఆ సినిమాను నిర్మించబోతున్నాడు. హీరోగా నటిస్తున్నందుకుగాను షాహిద్ కు నలభ కోట్ల రూపాయల  రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఓకే చెప్పాడట కరణ్ జోహార్. 'కబీర్ సింగ్' సినిమా దాదాపు రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

యాభై కోట్ల బడ్జెట్ తో రూపొందించిన 'కబీర్ సింగ్'కి ఈ రేంజ్ లో వసూళ్లు రావడంతో షాహిద్ తన తదుపరి సినిమాల రెమ్యునరేషన్ పెంచేశాడు. షాహిద్ అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు. మొత్తానికి 'అర్జున్ రెడ్డి' రీమేక్ షాహిద్ రేంజ్ ని బాగానే పెంచేసింది.