ఒక్క పోస్ట్ కి రూ.2 కోట్లా.. ప్రియాంక డిమాండ్ మాములుగా లేదు!
చిన్న సెలబ్రిటీ అయినా.. బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. అలాంటిది మిలియన్ల ఫాలోవర్లు ఉండే స్టార్ సెలబ్రిటీల డిమాండ్ ఎలా ఉంటుందో
ఊహించుకోవచ్చు.
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు తమకున్న క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు. చిన్న సెలబ్రిటీ అయినా.. బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. అలాంటిది మిలియన్ల ఫాలోవర్లు ఉండే స్టార్ సెలబ్రిటీల డిమాండ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇండియాలో ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ప్రియాంక చోప్రాకి ఒక స్పాన్సర్డ్ ట్వీట్ కి అక్షరాలా కోటి తొంబై లక్షలు చెల్లిస్తున్నారట. ఆమె తరువాతి స్థానంలో టాప్ సెలబ్రిటీ అయిన విరాట్ కొహ్లీ ఉన్నారు. ఒక స్పాన్సర్డ్ పోస్ట్ కి విరాట్ కి కోటి ముప్పై లక్షల వరకు ఇస్తుంటారు. ఇది వరకు అయితే ఒక యాడ్ లో నటిస్తేనో.. లేక ఒక ప్రొడక్ట్ ని ఎండార్స్ చేస్తేనో కోటి రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చేవారు.
కానీ ఇప్పుడు ఎలాంటి కష్టం లేకుండా సోషల్ మీడియాలో ఒక ప్రొడక్ట్ కోసం ఓ పోస్ట్ పెడితే చాలు కోట్లు వచ్చి పడుతున్నాయి. ఈ ఆదాయం కోసం సెలబ్రిటీలు తన ఫాలోవర్ల సంఖ్య పెంచుకోవడానికి నానాతంటాలు పడుతుంటారు. ఈ విషయంలో మేల్ సెలబ్రిటీల కంటే ఫిమేల్ సెలబ్రిటీలే ఎక్కువ సంపాదిస్తున్నారని టాక్.
తమ అందాలను ప్రదర్శిస్తూ ఫాలోవర్స్ ని ఆకర్షిస్తూ ఇలా బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ ఎక్కువ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాతో బాగానే సంపాదించేస్తున్నారు.