హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శితో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ ఆవరణలో ప్రెస్ మీట్  పెట్టుకోవడానికి అసెంబ్లీ కార్యదర్శి అనమతించలేదు. దీంతో రేవంత్ రెడ్డి ఆయనతో  వాగ్వాదం చోటు చేసుకొంది.

శుక్రవారం నాడు అసెంబ్లీ ఆవరణలో  ప్రెస్ మీట్ పెట్టడానికి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చాడు. అయితే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కు అసెంబ్లీ కార్యదర్శి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయమై రేవంత్ రెడ్డి అసెంబ్లీ కార్యదర్శితో వాగ్వాదానికి దిగాడు.