యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోసారి విజయ్ దేవరకొండ ఎమోషనల్ లవ్ స్టోరీతో మెప్పించినట్లు తెలుస్తోంది. ఆడియన్స్ నుంచి డియర్ కామ్రేడ్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించాడు. 

గీత గోవిందం తర్వాత విజయ్, రష్మిక జంట మరోసారి ఈ చిత్రంలో మెరిశారు. యూఎస్ ప్రీమియర్స్ లో డియర్ కామ్రేడ్ చిత్రం మంచి వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. గురువారం రోజు సాయంత్రమే ఈ చిత్ర ప్రీమియర్స్ యూఎస్ లో పడ్డాయి. ప్రీమియర్స్ కి గాను డియర్ కామ్రేడ్ చిత్రం 2.5 లక్షల డాలర్లు వసూలు చేసింది. 

విజయ్ దేవరకొండ చిత్రం యూఎస్ లో ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుండడం విశేషమే. డియర్ కామ్రేడ్ ప్రీమియర్స్ కలెక్షన్స్ ఈ ఏడాది విడుదలైన రాంచరణ్ వినయ విధేయ రామ చిత్ర ప్రీమియర్ వసూళ్ల కంటే ఎక్కువ. ఈ ఏడాది విడుదలైన మహర్షి చిత్రం 5 లక్షల డాలర్లు, కథానాయకుడు 4.8 లక్షల డాలర్లులు, ఎఫ్ 2.6 లక్షల డాలర్లు యూఎస్ ప్రీమియర్స్ ద్వారా సాధించాయి.