గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నాని.. వైసీపీ నేత పీవీపీల మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ జనం దృష్టిని ఆకర్షిస్తున్నారు.

తాజాగా  తమ జీతాలు చెల్లించకుండా కేశినేని ట్రావెల్స్‌ను మూసేశారంటూ ఆ సంస్ధ సిబ్బంది విజయవాడలో ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై శుక్రవారం పీవీపీ ట్వీట్ చేశారు. కసాయి వాడికి గొర్రె మీద ఉన్న ప్రేమ కూడా నీకు నీ దగ్గర పని చేసే కార్మికుల మీద లేదే?  

వేలాదిమంది పొట్ట కొట్టి ఈ రోజు నువ్వు అందలమెక్కి కూర్చున్నావు! కడుపుకాలి.. ఆ కడుపు మంటతో.. రోడ్డెక్కిన వేలాది కుటుంబాలను మనసుంటే ఆదుకో.. లేదంటే సంకనాకిపోతావు.. నీ బాస్ లాగా అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు బెజవాడలో ఆసక్తికరంగా మారింది.