మైనర్ బాలికను వ్యభిచారంలోకి దించేందుకు ఇద్దరు మహిళలు చేసిన ప్రయత్నాన్ని బంజారాహిల్స్ పోలీసులు భగ్నం చేశారు. తన భర్త కోరిక తీర్చాలని ఓ మహిళ బాలికను వేధించడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... కుందన్ బాగ్ లో నివసించే బాలికకు అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ పరిచయమైంది. తరచూ ఆమె బాలికతో మంచి చెడులు మాట్లాడేది. కాగా ఇటీవల ఆ మహిళ బాలికను తీసుకొని తన స్నేహితురాలి ఇంటికి తీసుకువెళ్లింది. అక్కడ  ఆ మహిళ స్నేహితురాలి భర్తతో శృంగారం చేయాలని బాలికను ఒత్తిడి చేశారు.

ఆ వ్యక్తి కూడా బాలిక పట్ల నీచంగా ప్రవర్తించాడు. బెదిరిపోయిన యువతి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. కాగా... బాలికను ఆపిన మహిళ తనతోపాటు షాపింగ్ కి తీసుకు వెళ్లింది. అక్కడ రూ.5వేలు ఖర్చుచేసి బాలికకు నచ్చినవి కొనిపెట్టి ఇంటికి పంపించింది. విషయం ఎవరికీ చెప్పవద్దని చెప్పంది. ఆమె కొనిచ్చిన వస్తువులను చూసిన తల్లి ఎక్కడివని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది.

వెంటనే బాలికను ఆ మహిళ ఇంటికి తీసుకువెళ్లి ఆమె తల్లి నిలదీసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న వృద్ధుడు బాలికను అసభ్యంగా తాకుతూ నీచంగా ప్రవర్తించాడు. కోపంతో ఊగిపోయిన తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపాలని ప్రయత్నించారంటూ ఆమె తల్లి పోలీసులకు వివరించింది. 

దీంతో బంజారాహిల్స్ పోలీసులు మహిళ, ఆమె భర్త, ఫ్రెండ్‌పై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. పేద కుటుంబాల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకొని కొంతమంది మహిళలు వారి ఆడ పిల్లలను వ్యభిచార కూపంలోకి దించుతున్నారని, ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.