Asianet News TeluguAsianet News Telugu

గాంధీ ఆస్పత్రిలో వైద్యుల టిక్ టాక్.. సస్పెన్షన్

ఒకవైపు రోగులు వైద్యం అందక ఇబ్బంది పడుతుంటే... జూనియర్ వైద్యులు  టిక్ టాక్ చేస్తూ కాలక్షేపం చేయడం గమనార్హం. గాంధీ ఆస్పత్రిలోని ఫిజయో థెరపీ విభాగంలోని జూనియర్ వైద్యులు చేసిన టిక్ టాక్ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 

junior doctors suspended over making tik tok video in gandhi hospital
Author
Hyderabad, First Published Jul 26, 2019, 1:01 PM IST

ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కొందరు అధికారులకు టిక్ టాక్ పిచ్చి పట్టింది. విధులను పక్కన పెట్టి టిక్ టాక్ లు చేస్తూ కాలక్షేమం చేస్తున్నారు. తీరా ఆ వీడియోలు వైరల్ కావడంతో ఉద్యోగాలకే ఎసరు పెట్టుకుంటున్నారు. తాజాగా... గాంధీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యులు టిక్ టాక్ చేసి ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణకులయ్యారు.

ఒకవైపు రోగులు వైద్యం అందక ఇబ్బంది పడుతుంటే... జూనియర్ వైద్యులు  టిక్ టాక్ చేస్తూ కాలక్షేపం చేయడం గమనార్హం. గాంధీ ఆస్పత్రిలోని ఫిజయో థెరపీ విభాగంలోని జూనియర్ వైద్యులు చేసిన టిక్ టాక్ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా... ఆ ఇద్దరు జూనియర్ వైద్యులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 

ఫిజయోథెరపీ విభాగంలో టిక్ టాక్ చేసిన ఇద్దరు జూనియర్ వైద్యులను సస్పెండ్ చేశారు. ఆ విభాగం ఇన్ ఛార్జిని కూడా ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఘనతో గాంధీ వైద్య కాళాశాల విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ ఇద్దరు జూనియర్ డాక్టర్లు వేరే కాలేజీ నుంచి శిక్షణ కోసం ఇక్కడికి వచ్చారని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios