బెంగుళూరు:  కర్ణాటక అసెంబ్లీ బీజేపీకి ప్రయోగాలు చేసేందుకు ల్యాబ్ గా మారిందని మాజీ ముఖ్యమంత్రి కర్ణాటకలో కాంగ్రెస్ పక్ష నేత సిద్దరామయ్య విమర్శించారు.

శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ  రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం బీజేపీకి లేదని సిద్దరామయ్య అభిప్రాయపడ్డారు.  రాజ్యాంగ విలువలపై బీజేపీకి నమ్మకం లేదని ఆయన విమర్శించారు.

 

మూడు రోజుల క్రితం విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓటమి పాలయ్యారు. విశ్వాస పరీక్షలో కుమారస్వామికి కేవలం 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. కుమార్సవామికి వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. స్పీకర్ రమేష్ కుమార్ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.

 

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణం చేయనున్నారు. యడ్యూరప్ప ఒక్కరే  ప్రమాణం చేస్తారు.శుక్రవారం ఉదయం యడ్యూరప్ప గవర్నర్ వాజ్ భాయ్ వాలాతో భేటీ అయ్యారు. గవర్నర్ తో సమావేశం ముగిసిన తర్వాత ఇవాళ సాయంత్రం సీఎంగా ప్రమాణం చేస్తానని యడ్యూరప్ప ప్రకటించారు.

సంబంధిత వార్తలు

నేడు ఆరు గంటలకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం