ప్రధాని మోడీ సమర్థ పాలన.. బీజేపీ భావాలు నచ్చే తాను భారతీయ జనతా పార్టీలో చేరినట్లు ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా కిశోర్ రెడ్డి. బీజేపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు టీడీపీలో ఎలాంటి సభ్యత్వం లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వైసీపీకి సరైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని 2024 నాటికి ఏపీలో కాషాయ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యమని కిశోర్ రెడ్డి పేర్కొన్నారు. తాను ఎలాంటి పదవులు ఆశించి బీజేపీలోకి చేరలేదన్నారు.

దివంగత భూమా నాగిరెడ్డి అన్న కుమారుడైన కిశోర్ రెడ్డి గతంలో సోదరి అఖిలప్రియకు అండగా ఉంటూ టీడీపీ తరపున పనిచేశారు. ఆయన బీజేపీలో చేరడంతో ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త గ్రూపులు మొదలయ్యాయని విశ్లేషకులు అంటున్నారు.